ఎమ్మెల్యే అత్తార్ హోటల్‌పై చెప్పుల దాడి
జగన్ రైతు భరోసా యాత్ర సందర్బంగా కదిరిలో శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. జగన్ మీటింగ్‌కు వేలాదిగా జనం తరలివచ్చారు. మీటింగ్ ముగియగానే తిరిగి వెళ్తున్న వైసీపీ కార్యాకర్తలు ఇటీవలే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అత్తార్ బాషా హోటల్‌పై కన్నెర్ర చేశారు. హోటల్‌పైకి చెప్పులు, రాళ్లు,వాటర్ బాటిళ్లు విసిరారు. పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని అత్తార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. మరోవైపు జిల్లాలో పోలీసులు […]
జగన్ రైతు భరోసా యాత్ర సందర్బంగా కదిరిలో శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. జగన్ మీటింగ్‌కు వేలాదిగా జనం తరలివచ్చారు. మీటింగ్ ముగియగానే తిరిగి వెళ్తున్న వైసీపీ కార్యాకర్తలు ఇటీవలే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అత్తార్ బాషా హోటల్‌పై కన్నెర్ర చేశారు. హోటల్‌పైకి చెప్పులు, రాళ్లు,వాటర్ బాటిళ్లు విసిరారు. పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని అత్తార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
మరోవైపు జిల్లాలో పోలీసులు పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. ఈనెల ఒకటినుంచే ఈ సెక్షన్ అమలులో ఉందని కాబట్టి ప్రజాసంఘాలు, పార్టీలు ముందస్తు అనుమతి లేకుండా సభలు గానీ, సమావేశాలు గానీ నిర్వహించరాదని జిల్లా ఎస్సీ కార్యాలయం వెల్లడించింది. జిల్లాలో టీడీపీ ఆగడాలు, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆదివారం జిల్లా ఎస్సీ కార్యాలయం ముందు జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహించనున్నారు.
Click on Image to Read: