నష్టాలు సరిచూసుకుంటున్న మహేష్ బాబు
బ్రహ్మోత్సవం బిచానా ఎత్తేసింది. అట్టర్ ఫ్లాప్ టాక్ తో నడిచిన ఈ సినిమా.. అ..ఆ దెబ్బకు ఉన్న 2-3 థియేటర్లలో కూడా పని ముగించింది. ఈ సినిమా దెబ్బకు ఒక దశలో నిర్మాత పీవీపీ సినిమాల నుంచి తప్పుకుంటాడనే రూమర్ వచ్చింది. అయితే ఆ తర్వాత పీవీపీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తను మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పాడు. బ్రహ్మోత్సవం దెబ్బ తనకో లెక్క కాదంటూ మాట్లాడాడు. అవన్నీ పక్కనపెడితే….. బ్రహ్మోత్సవానికి ఎంత నష్టం వచ్చిందనే అసలైన […]
BY admin4 Jun 2016 11:20 PM GMT
X
admin Updated On: 5 Jun 2016 1:06 AM GMT
బ్రహ్మోత్సవం బిచానా ఎత్తేసింది. అట్టర్ ఫ్లాప్ టాక్ తో నడిచిన ఈ సినిమా.. అ..ఆ దెబ్బకు ఉన్న 2-3 థియేటర్లలో కూడా పని ముగించింది. ఈ సినిమా దెబ్బకు ఒక దశలో నిర్మాత పీవీపీ సినిమాల నుంచి తప్పుకుంటాడనే రూమర్ వచ్చింది. అయితే ఆ తర్వాత పీవీపీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తను మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పాడు. బ్రహ్మోత్సవం దెబ్బ తనకో లెక్క కాదంటూ మాట్లాడాడు. అవన్నీ పక్కనపెడితే….. బ్రహ్మోత్సవానికి ఎంత నష్టం వచ్చిందనే అసలైన లెక్కలు తీసే కార్యక్రమం ఇప్పుడు మొదలైంది. నిర్మాతతో పాటు మరికొందరు ప్రముఖులు నష్టాల లెక్కలు తీయడం మొదలుపెట్టారు. లండన్ లో ఉన్న సహ-నిర్మాత, హీరో మహేష్ బాబుకు కూడా నష్టాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే విశ్లేషకులు చెప్పినట్టు సినిమాకు 40కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అంతర్గత సమాచారం ప్రకారం…. 70కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు 40కోట్లు కంటే ఇంకా ఎక్కువే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. బయటకు చెబుతున్నట్టు 35 కోట్ల రూపాయల వసూళ్లు కూడా రాలేదని తెలుస్తోంది. మహేష్ ఇమేజ్ ను, పీవీపీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని… నష్టాల్ని కాస్త తగ్గించి చూపించాలని భావిస్తున్నారు. ఫైనల్ గా ఎంత ఫిగర్ చెబుతారనేది త్వరలోనే తెలుస్తుంది.
Next Story