ఈ స్టేట్ మీ జాగీరా... మెంటల్ మీకా మాకా?... కాపు కమ్మ భవనాలకు సిద్దమా?
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడపద్మనాభం మరోసారి ఫైర్ అయ్యారు. ఒకటీవీచానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు కారణంగా దేశంలోనే రాష్ట్రం పరువుపోతోందన్నారు. ఇంత సీనియర్ ముఖ్యమంత్రి అయి ఉండి ఇన్ని అబద్దాలు చెప్పి పాలించడం ఏమిటని ప్రశ్నించారు. ఏదో అనుభవం లేనివ్యక్తులు అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకుంటే అర్థం చేసుకోవచ్చని …చంద్రబాబు లాంటి వ్యక్తి ఇలాంటి పనిచేయడం దారుణమన్నారు. కాపులను కరివేపాకు, గోరింటాకు లాగా చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. తుని ఘటనవెనుక ముద్దాయి ఎవరో […]
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడపద్మనాభం మరోసారి ఫైర్ అయ్యారు. ఒకటీవీచానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు కారణంగా దేశంలోనే రాష్ట్రం పరువుపోతోందన్నారు. ఇంత సీనియర్ ముఖ్యమంత్రి అయి ఉండి ఇన్ని అబద్దాలు చెప్పి పాలించడం ఏమిటని ప్రశ్నించారు. ఏదో అనుభవం లేనివ్యక్తులు అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకుంటే అర్థం చేసుకోవచ్చని …చంద్రబాబు లాంటి వ్యక్తి ఇలాంటి పనిచేయడం దారుణమన్నారు.
కాపులను కరివేపాకు, గోరింటాకు లాగా చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. తుని ఘటనవెనుక ముద్దాయి ఎవరో తెలుసని సమయం వచ్చినప్పుడు బయటపెడుతానన్నారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు తిరిగి కాపులపైనే స్వారీ చేస్తున్నారని విమర్శించారు. కాపు భవనాలకు చంద్రబాబు పేరుపెట్టే ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కమ్మభవనాలు కూడా ఉన్నాయని… వాటికి కాపు కమ్మ భవనాలు అని పేరు పెట్టేందుకు సిద్దమా అనిప్రశ్నించారు.
కాపు రుణాలను పచ్చచొక్కా ఉన్నవారికి, వడ్డీవ్యాపారులకే ఇస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. కాపులకు సభలు పెట్టుకునే అర్హత కూడా లేదా అని ప్రశ్నించారు. ఈ స్టేట్ ఏమైనా వారి జాగీరా అని ప్రశ్నించారు. చంద్రబాబు అనుమతితోనే సభలు పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. మోచేతి నీళ్లు తాగుతూ కాపులు బతకాలా అని ప్రశ్నించారు. తన విమర్శలతో చంద్రబాబు కంటే చెక్కభజన చేసే వారికే ఎక్కువ కోపం వస్తోందని ముద్రగడ మండిపడ్డారు. చంద్రబాబు హామీ ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు తాము ఆందోళన చేసేవాళ్లం కాదన్నారు. మెంటల్ తమకు కాదని వాళ్లకే మెంటల్ ఉందని ముద్రగడ మండిపడ్డారు. రిజర్వేషన్ల కోసం ఎంతదూరం పోరాడేందుకైనా సిద్ధమన్నారు. అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానన్నారు.
Click on Image to Read: