ఈ నికృష్ట రాజకీయాలు అప్పుడే చూపించాం, కాంగ్రెస్ నేతలు వస్తే తరిమేశా..
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలపై నటుడు మోహన్ బాబు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరోపార్టీలో చేరే నికృష్ట రాజకీయాలను తాము అసెంబ్లీ రౌడీ సినిమాలోనే చూపించామన్నారు. అసెంబ్లీ రౌడీ సినిమా 45 రోజుల్లో తీస్తే… 25 వారాలుఆడిందనిచెప్పారు. అసెంబ్లీ రౌడీ విడుదలై పాతికేళ్లు అయిన సందర్బంగా మోహన్ బాబు, డైరెక్టర్ బి గోపాల్,రచయిత పరుచూరికలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రౌడీ క్లైమాక్స్‌ను తిరుచానూర్ సమీపంలో తీస్తుంటే ఐదుగురు కాంగ్రెస్ నేతలు వచ్చి […]
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలపై నటుడు మోహన్ బాబు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరోపార్టీలో చేరే నికృష్ట రాజకీయాలను తాము అసెంబ్లీ రౌడీ సినిమాలోనే చూపించామన్నారు. అసెంబ్లీ రౌడీ సినిమా 45 రోజుల్లో తీస్తే… 25 వారాలుఆడిందనిచెప్పారు. అసెంబ్లీ రౌడీ విడుదలై పాతికేళ్లు అయిన సందర్బంగా మోహన్ బాబు, డైరెక్టర్ బి గోపాల్,రచయిత పరుచూరికలిసి మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ రౌడీ క్లైమాక్స్‌ను తిరుచానూర్ సమీపంలో తీస్తుంటే ఐదుగురు కాంగ్రెస్ నేతలు వచ్చి గొడవ చేశారన్నారు. అప్పుడు తాను చేతిలో ఉన్న కత్తితో వారిని తరిమేశానన్నారు. అనంతరం పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. అసెంబ్లీ రౌడీ టైటిల్‌పై శాసనసభలో రచ్చ జరిగిందన్నారు. తన కటౌట్లను కూడా ధ్వంసం చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పటి స్పీకర్ సినిమాను చూసి అభ్యంతరం లేదని చెప్పడంతో సినిమా విడుదల చేశామన్నారు. కొద్దిరోజుల క్రితం కూడా ఫిరాయింపు రాజకీయాలపై మోహన్ బాబు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఫిరాయించడం అంటే ఒక ఇంటిలో తిని మరో ఇంటిలో ఉండడమేనని వ్యాఖ్యానించారు. నాయకుడు నచ్చకపోతే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలన్నారు.
Click on Image to Read: