తప్పించుకుని తిరిగే వాడు పీసీసీ అధ్యక్షుడా! నేనే అధ్యక్షుడై ఉంటే..
టీపీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ కమిటీ బాగున్నా…పీసీసీ అధ్యక్షుడి పనితీరు మాత్రం బాగోలేదని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. ఒక మంత్రి సవాల్ విసిరితే దాన్ని ఎదుర్కోలేక తప్పించుకు తిరిగే వాడు పీసీసీ అధ్యక్షుడా అని ఉత్తమ్‌పై మండిపడ్డారు. తానే పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేదన్నారు. ఒకవేళ గెలిపించలేకపోయి ఉంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవాడినన్నారు. […]
టీపీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ కమిటీ బాగున్నా…పీసీసీ అధ్యక్షుడి పనితీరు మాత్రం బాగోలేదని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. ఒక మంత్రి సవాల్ విసిరితే దాన్ని ఎదుర్కోలేక తప్పించుకు తిరిగే వాడు పీసీసీ అధ్యక్షుడా అని ఉత్తమ్‌పై మండిపడ్డారు. తానే పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేదన్నారు. ఒకవేళ గెలిపించలేకపోయి ఉంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవాడినన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిని చేసి ఉండాల్సిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని పొన్నాలను పీసీసీ అధ్యక్షుడిగా నియమించి తొలి తప్పు చేసిన హైకమాండ్… ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసి రెండోసారీ తప్పు చేసిందన్నారు. పొన్నాలకంటే ఉత్తమ్ కుమార్‌రెడ్డే బలహీనుడని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని సాధారణ ఎన్నికల్లో ఓడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ఆరోపించారు. ఉత్తమ్ నాయకత్వంలో టీ కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌పై సోనియా గాంధీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. లేకుంటే పార్టీకి సర్జరీ కాదు ఏకంగా పోస్టు మార్టమే చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు కూడా తానుసిద్దమన్నారు. పార్టీ పరిస్థితిని వివరిస్తూ త్వరలోనే సోనియాకు లేఖ రాస్తానని కోమటిరెడ్డి చెప్పారు.
పాలేరు ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి గెలుపు కోసం పీసీసీ ఏమాత్రం పనిచేయలేదన్నారు. సాగునీటి కోసమే మంత్రి హరీష్‌రావు కలిసినట్టు చెప్పారు. టీఆర్ఎస్‌లో చేరే అంశంపై చర్చ జరగలేదన్నారు. కాంగ్రెస్‌ను వీడుతానని తానెప్పుడూ చెప్పలేదన్నారు.
Click on Image to Read: