మహమ్మద్ అలీ కన్నుమూత!
ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ ఆలీ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో ఫినిక్స్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారని అధికారులు ధ్రువీకరించారు. దీర్ఘకాలికంగా పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవలి కాలంలో శ్వాస కోశ వ్యాధితో అనారోగ్యం బారిన పడ్డారు. దాదాపు 32 ఏళ్లుగా ఆయన పార్కిన్ సన్ వ్యాధిలో పోరాడాడు. దీనికి కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధులు తోడవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. కొంతకాలంగా ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన బాహ్య […]
BY sarvi4 Jun 2016 5:21 AM IST
X
sarvi Updated On: 4 Jun 2016 5:27 AM IST
ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ ఆలీ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో ఫినిక్స్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారని అధికారులు ధ్రువీకరించారు. దీర్ఘకాలికంగా పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవలి కాలంలో శ్వాస కోశ వ్యాధితో అనారోగ్యం బారిన పడ్డారు. దాదాపు 32 ఏళ్లుగా ఆయన పార్కిన్ సన్ వ్యాధిలో పోరాడాడు. దీనికి కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధులు తోడవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. కొంతకాలంగా ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. చివరగా ఆయన ఏప్రిల్ 9న ఒక వేడుకలో కనిపించారు.
బాక్సింగ్ వల్లే ఆయనకు పార్కిన్‌సన్ వ్యాధి వచ్చింది. ప్రత్యర్థులు ఆయన తలపై కురిపించిన ముష్టిఘాతాలకు ఆయన తలలోని నరాలు దెబ్బతిన్నాయి. ఇది పార్కిన్‌సన్ వ్యాధికి దారి తీసింది. ఈ వ్యాధి సోకిన వారు సరిగా నడవలేరు, ఎక్కువగా ఆలోచించలేరు. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. తీవ్ర ఒత్తిడిగి లోనవుతారు. 1942, జనవరి 17న అమెరికాలో జన్మించిన అలీ జీవితంలో ఎన్నో ఆటంకాలను అధిగమించాడు. చిన్నతనం నుంచి జాత్యాంహకారం వల్ల నిత్యం మానసిక క్షోభ అనుభవించాడు. 12 ఏళ్ల ప్రాయంలోనే బాక్సింగ్ కెరీర్‌ను ప్రారంభించిన అలీ 22 ఏళ్లకే వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా అవతరించాడు.
వియత్నాం యుద్ధంలో అమెరికా సైన్యంలో సేవలందిద్దామనుకున్న అలీకి తీవ్ర అవమానం జరిగింది. ముస్లిం, నల్లజాతీయుడన్న కారణంగా ఆయన్ను సైన్యంలో చేర్చుకోలేదు. అయినప్పటికీ ఆయన గత 100 ఏళ్లలో ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారుల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు. ఆయన కూతురు లైలీ అలీ కూడా బాక్సరే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బాక్సర్లుగా అవతరించడానికి మహమ్మద్ అలీ స్ఫూర్తిగా నిలిచాడు. 20 శతాబ్దంలో ఆయన వల్ల బాక్సింగ్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ప్రాధాన్యం దక్కింది. ఆయన మరణంతో క్రీడాలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
Next Story