మరోసారి ఓటుకు నోటు!
తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్ర ఓటుకు నోటు కేసు. తెలుగుదేశం పార్టీ నేత రూ.50లక్షల రూపాయలతో వీడియోలకు చిక్కిన బడా కుంభకోణం. జాతీయ స్థాయిలో చంద్రబాబు పరువు మంటగలిపిన గతం. ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా?.. మరోసారి ఓటుకు నోటు కుంభకోణం వెలుగుచూసింది. అయితే, ఇది తెలంగాణలో కాదు.. కర్ణాటకలో..! రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా కర్ణాటలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూడటంతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఓ ఛానల్ స్టింగ్ ఆపరే షన్‌లో ఇది […]
BY sarvi3 Jun 2016 2:57 AM IST
X
sarvi Updated On: 3 Jun 2016 4:31 AM IST
తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్ర ఓటుకు నోటు కేసు. తెలుగుదేశం పార్టీ నేత రూ.50లక్షల రూపాయలతో వీడియోలకు చిక్కిన బడా కుంభకోణం. జాతీయ స్థాయిలో చంద్రబాబు పరువు మంటగలిపిన గతం. ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా?.. మరోసారి ఓటుకు నోటు కుంభకోణం వెలుగుచూసింది. అయితే, ఇది తెలంగాణలో కాదు.. కర్ణాటకలో..! రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా కర్ణాటలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూడటంతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి.
ఓ ఛానల్ స్టింగ్ ఆపరే షన్‌లో ఇది బట్టబయలైంది. 5 కోట్లు ఇస్తే ఓటేసేందుకు సిద్ధమని నలుగురు ఎమ్మెల్యేలు ఆఫర్ ఇచ్చినట్లు ఉన్న వీడియో కలకలం రేపింది. స్టింగ్ ఆపరేషనలో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు జేడీఎస్, ఒకరు కేజీపీకి చెందిన వారు కాగా, మరొకరు ఇండిపెండెంట్. జేడీఎస్‌కు చెందిన చాముండేశ్వరి ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడ, బసవకల్యాణకు చెందిన మల్లికార్జున ఖూబా, కేజీపీకి చెందిన ఆళంద ఎ మ్మెల్యే బి.ఆర్.పాటిల్, కోలారుకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వరూ ్తరు ప్రకాష్ ఈ స్టింగ్‌లో దొరికిపోయారు.
ఇది జేడీఎస్ కుట్రలో భాగమని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రకాష్ ఆరోపించారు. ఓ పార్టీలో తమాషాగా తాను ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అన్నానని, నిజానికి తాను ఏ తప్పూ చేయలేదని కేజీపీ ఎమ్మెల్యే పాటిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు 3 నెలలు వాయిదా పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలకు రూ.100కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధమని జేడీఎస్ అభ్యర్థి ఫరూక్ అన్నట్లు తేలడంతో.. ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇంతవరకూ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. వీటిపై త్వరలోనే విచారణ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Next Story