లక్ష్మణ్ గతం మరిచి మాట్లాడుతున్నాడా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోయే తానే ఇరుకున పడ్డాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం కల బీజేపీ వల్లే సాధ్యమైంది అని లక్ష్మణ్ అన్నారు. మేం చిత్తశుద్ధితో మద్దతిచ్చాం కాబట్టే ఈ రోజు ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బీజేపీ తెలంగాణ కు మద్దతిచ్చిన విషయాన్ని అంగీకరిస్తూనే.. ఆఖరి నిమిషంలో అడ్డుకోవాలని చూసిన వైనాన్ని ఇంకా ఎవరూ […]
BY sarvi2 Jun 2016 9:09 PM GMT
X
sarvi Updated On: 2 Jun 2016 11:08 PM GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోయే తానే ఇరుకున పడ్డాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం కల బీజేపీ వల్లే సాధ్యమైంది అని లక్ష్మణ్ అన్నారు. మేం చిత్తశుద్ధితో మద్దతిచ్చాం కాబట్టే ఈ రోజు ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బీజేపీ తెలంగాణ కు మద్దతిచ్చిన విషయాన్ని అంగీకరిస్తూనే.. ఆఖరి నిమిషంలో అడ్డుకోవాలని చూసిన వైనాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని… నోటిదాకా వచ్చిన తెలంగాణను ఎక్కడ దూరం చేస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ కలిగించింది మీ కమలనాథులే కదా? అని గుర్తు చేసుకుని మండిపడుతున్నారు. లక్ష్మణ్ గతం మొత్తం మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ దీక్షతో ఉద్యమం ఉద్ధృతం అయిన సంగతి తెలిసిందే! సరిగ్గా అదే సమయంలో బీజేపీ తెలంగాణవాదం అందుకుంది. కాంగ్రెస్ అప్పటికప్పడు తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకురావాలన్న ప్రణాళికతో బీజేపీ నాయకులు తెలంగాణవాదాన్ని బలపరుస్తూ తెలంగాణలో పలు సభలు, సమావేశాలు, నిరసనలు నిర్వహించారు. ఒకదశలో తనకు బలం లేదని తెలిసీ.. లోక్‌సభలో ప్రయివేటు బిల్లు పెట్టింది. బలం లేక అది వీగిపోయింది. 2011 నుంచి బీజేపీలో అనూహ్య మార్పు వచ్చింది. సీమాంధ్ర ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడంపై సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. వారికి మద్దతుగా మాట్లాడారు. అప్పుడే.. టీడీపీ – బీజేపీ మైత్రి మరో సారి చిగురించింది. తరువాత తెలంగాణ వాదానికి బీజేపీ క్రమంగా దూరం కాసాగింది. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసినా.. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెనకడుగు వేశారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలకు అసెంబ్లీలో ఘనస్వాగతం పలికింది బీజేపీ. కనీసం ఈ విషయంలో టీడీపీని ఎలాంటి మాట అనలేదు. పైపెచ్చు సీఎం కేసీఆర్‌ను నిందించడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని తెలంగాణవాదులు, గులాబీనేతలు మండిపడుతున్నారు. తెలంగాణ బిల్లు పాస్ అవుతుందన్న ఆఖరినిమిషంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు లేవనెత్తిన అభ్యంతరాలు తెలంగాణ ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. బీజేపీ అభ్యంతరం పెట్టినా.. తెలంగాణ ఆగదని తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేందుకు సరిపడినంత మెజారిటీ అక్కడ కాంగ్రెస్ కు ఉంది కాబట్టి. మెజారిటీ పార్టీలన్ని ఒప్పుకున్నాయి. ఒక్క టీడీపీ -బీజేపీ ద్వయం తప్ప. బిల్లు ఎలాగైనా పాసవుతుంది కాబట్టి. మొక్కుబడిగా ఒప్పుకున్నాయి తప్ప మనస్ఫూర్తిగా ఆ రెండుపార్టీలు ఒప్పుకోలేదన్న సంగతి జగమెరిగిన సత్యం. అందుకే, తెలంగాణ ఆవిర్భావంలో బీజేపీ పాత్ర ఏంటి? అంటే..ఎవరూ కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిసారీ.. తెలంగాణవాదులు కమలనాథులపై ఒంటికాలిపై లేస్తున్నారు. ముందు సొంతంగా ఒక్కసీటన్నా గెలిచి చూపించండి. అంతేగానీ, ప్రజల మద్దతు లేని మీరు ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలుకున్నారు.
Next Story