Telugu Global
NEWS

రేణుకమ్మలో అమ్మతనం లేదా..?

కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి మానవత్వం మరిచారు. ఒక రెస్టారెంట్‌లో రేణుకా చౌదరి చేసిన పనిపై సోషల్‌మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.తన కుటుంబంతో కలిసి ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్లిన రేణుకా చౌదరీ తన ఇంట్లోని చిన్పపాపను చూసుకునే అమ్మాయిని కూడా తీసుకెళ్లారు. కాని అక్కడ రేణుకా చౌదరి ఆమె కుటుంబ సభ్యులు దర్జాగా కూర్చొని భోజనం చేశారు. కానీ చిన్నపాపను చూసుకొనే అమ్మాయి విషయంలో రేణుకా దారుణంగా వ్యవహరించారు. తాము తింటున్నంతసేపు సదరు అమ్మాయిని ఒక […]

రేణుకమ్మలో అమ్మతనం లేదా..?
X

కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి మానవత్వం మరిచారు. ఒక రెస్టారెంట్‌లో రేణుకా చౌదరి చేసిన పనిపై సోషల్‌మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.తన కుటుంబంతో కలిసి ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్లిన రేణుకా చౌదరీ తన ఇంట్లోని చిన్పపాపను చూసుకునే అమ్మాయిని కూడా తీసుకెళ్లారు. కాని అక్కడ రేణుకా చౌదరి ఆమె కుటుంబ సభ్యులు దర్జాగా కూర్చొని భోజనం చేశారు. కానీ చిన్నపాపను చూసుకొనే అమ్మాయి విషయంలో రేణుకా దారుణంగా వ్యవహరించారు. తాము తింటున్నంతసేపు సదరు అమ్మాయిని ఒక బానిసలాగా పక్కనే నిల్చోబెట్టింది. వీరంతా తింటుంటే పాపం ఆ అమ్మాయి చేతులు కట్టుకుని నిస్సహాయంగా నిల్చొనివుంది. కనీసం తనవెంట వచ్చిన అమ్మాయికి కాసింత భోజనం పెట్టించాలన్న మానవత్వాన్నికూడా రేణుకా చౌదరి మరిచిపోయారు.

41464863798_625x300ఎంపీ చేసిన పనిని రెస్టారెంట్‌కు వచ్చిన మరో వ్యక్తి గమనించి ఫొటోలు తీశాడు. వాటిని సోషల్‌మీడియాలోకి వదిలాడు. అంతే రేణుకా చౌదరిపై నెటిజన్లు దండెత్తారు. ఒక ఎంపీ అయి వుండి గతంలో మహిళా శిశుసంక్షేమా శాఖ కూడా చేసి వుండి ఒక అమ్మాయిపట్ల ఇలాగేనా వ్యవహరించేది అని మండిపడుతున్నారు. రేణుకమ్మలో అమ్మదనం ఏమైందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రియమైన రేణుకా చౌదరీగారూ.. మీ చిన్నారిని చూసుకునే అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు వారిని అసలు రెస్టారెంట్లకు తీసుకెళ్లకండి’ అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పప్పుతో భోజనం చేస్తున్నప్పుడు రేణుకా ఇలాగే నిల్చుంటారా అని మరో వ్యక్తి ట్విట్టర్‌లో ప్రశ్నించాడు.

https://twitter.com/Aparna/status/737825276416163840

Click on Image to Read:

KE-Prabhakar

babu-purandeshwari

damodar-raja-narasimha

ashok-gajapati-raju

jagadish-reddy

komatireddy

d-srinivas-rapolu-ananda-bh

revanth-kcr

lokehs-bramini

paritala-sunitha2

BHUMA-NAGI-REDDY

jyotula-nehru

dgp-ramudu-paritala-sriram

bhuma-nagi-reddy

First Published:  3 Jun 2016 12:32 AM IST
Next Story