ఎమ్మెల్యే భాస్కరరావు జంప్...ఇప్పుడే ఏమీ చెప్పలేనంటున్న ఎంపీ
తెలంగాణలో టీడీపీని దాదాపు ఖాళీ చేసిన టీఆర్‌ఎస్ మరో విడతగా కాంగ్రెస్‌పై పడుతోంది. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావులు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది. గురువారం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంను కూడా కలిశారు. పార్టీ ఫిరాయింపుకు బలం చేకూరేలా గుత్తా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను తానుసమర్ధిస్తున్నానని చెప్పారు. టీ ప్రాజెక్టులపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపైనా గుత్తా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే టీఆర్ఎస్లో […]
తెలంగాణలో టీడీపీని దాదాపు ఖాళీ చేసిన టీఆర్‌ఎస్ మరో విడతగా కాంగ్రెస్‌పై పడుతోంది. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావులు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది. గురువారం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంను కూడా కలిశారు. పార్టీ ఫిరాయింపుకు బలం చేకూరేలా గుత్తా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను తానుసమర్ధిస్తున్నానని చెప్పారు. టీ ప్రాజెక్టులపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపైనా గుత్తా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదని గుత్తా చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనంటూ పార్టీ మార్పు వార్తలను ఖండించలేదు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈయనను జానారెడ్డికి శిష్యుడని చెబుతుంటారు. అయితే ఇటీవల ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణస్వీకారానికి కూడా భాస్కరరావు హాజరయ్యారు. భాస్కరరావు, తుమ్మల ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో వారి మధ్య మంచి బంధం ఉందని చెబుతుంటారు. కాంగ్రెస్ నల్లగొండ జిల్లాలో కాస్త బలంగా ఉంది. దీంతో కేసీఆర్ నల్లగొండపై ఫోకస్ పెట్టినట్టుగా భావిస్తున్నారు. గుత్తా, భాస్కరరావులు ముహూర్తం చూసుకుని టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
Click on Image to Read: