Telugu Global
National

మ‌ధుర‌లో అల్ల‌ర్లు: ఎస్పీ స‌హా 21 మంది మృతి

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మ‌ధురలో “ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి” అనే  ఓ అతివాద సంస్థ కార్య‌క‌ర్త‌లు చెల‌రేగిపోయారు. ఓ పార్కు స్థ‌లాన్ని ఖాళీ చేయించేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఎస్పీ , ఎస్‌హెచ్ ఓ తోపాటు మొత్తం 21 మంది మ‌ర‌ణించారు. త‌మ‌కు తాము స‌త్యాగ్ర‌హులుగా చెప్పుకునే దుండ‌గులు మ‌ధుర‌లోని 260 ఎక‌రాల జ‌వ‌హ‌ర్ బాగ్ అనే పార్కు స్థ‌లాన్ని ఆక్రమించారు. ఆక్ర‌మిత‌స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ […]

మ‌ధుర‌లో అల్ల‌ర్లు: ఎస్పీ స‌హా 21 మంది మృతి
X
ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మ‌ధురలో “ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి” అనే ఓ అతివాద సంస్థ కార్య‌క‌ర్త‌లు చెల‌రేగిపోయారు. ఓ పార్కు స్థ‌లాన్ని ఖాళీ చేయించేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఎస్పీ , ఎస్‌హెచ్ ఓ తోపాటు మొత్తం 21 మంది మ‌ర‌ణించారు. త‌మ‌కు తాము స‌త్యాగ్ర‌హులుగా చెప్పుకునే దుండ‌గులు మ‌ధుర‌లోని 260 ఎక‌రాల జ‌వ‌హ‌ర్ బాగ్ అనే పార్కు స్థ‌లాన్ని ఆక్రమించారు. ఆక్ర‌మిత‌స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స‌త్యాగ్ర‌హి గ్రూపు స‌భ్యులు అల్ల‌ర్ల‌కు దిగ‌వ‌చ్చ‌నే అనుమానంతో పోలీసులు వ‌చ్చి ఖాళీ చేయించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అక‌స్మాత్తుగా స‌త్యాగ్ర‌హి వ‌ర్గం నుంచి కాల్పులు ప్రారంభ‌మ‌య్యాయి. కాల్పుల్లో న‌గ‌ర ఎస్పీ ముఖుల్ ద్వివేదీ, ఫ‌రా పోలీస్ స్టేష‌న్ ఎస్‌హెచ్ ఓ సంతోష్ కుమార్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. దాదాపు 3000 మంది అల్ల‌రి మూక‌లు పోలీసుల‌పై దాడులు చేశారు.
ఈ అల్ల‌ర్ల‌లో వారు గ్ర‌నేడ్లు కూడా విసిరార‌ని జిల్లా మేజిస్ర్టేట్ రాజేశ్ కుమార్ తెలిపారు. దుండగుల దాడిలో ఓ సిలిండ‌ర్ కూడా పేలింది. పేలుడు ధాటికి సాధార‌ణ ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. అల్ల‌రి మూక‌ల దాడిలో ఇద్ద‌రు పోలీసు అధికారుల‌తో పాటు, మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 21కి చేరింది. విష‌యం తెలుసుకున్న సీఎం అఖిలేష్ యాద‌వ్ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సిందిగా డీజీపిని ఆదేశించారు. మ‌ర‌ణించిన పోలీసు అధికారుల‌కు రూ.20 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సీఎం ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సీఎంను అడిగి తెలుసుకున్నారు.
స‌త్యాగ్ర‌హి గ్రూపు స‌భ్యుల డిమాండ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. వారు ప్ర‌స్తుత‌మున్న ప్ర‌ధాని, రాష్ట్రప‌తి నియామ‌కాలు ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నారు. ప్ర‌స్తుత క‌రెన్సీ స్థానంలో ఆజాద్ హింద్ ఫౌజ్ మార‌కాన్ని తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 60లీట‌ర్ల డీజిల్‌ను కేవ‌లం ఒక‌రూపాయికి. 40 లీట‌ర్ల పెట్రోలును ఒక రూపాయికే విక్ర‌యించాల‌ని ష‌ర‌తులు విధించారు.
First Published:  2 Jun 2016 11:33 PM IST
Next Story