Telugu Global
NEWS

చంద్రబాబుకు పీడకలలంటే అంత ఇష్టమా?

ఏదైన ఒక అనుకోని చెడు సంఘటన జరిగితే సాధారణంగా రెండు రకాలుగా స్పందిస్తుంటారు జనం. ఒకటి.. గాయాన్ని మరిచిపోయి కొత్త జీవితం వైపు పాజిటివ్ కోణంలో అడుగులు వేస్తుంటారు కొందరు. మరికొందరు గాయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ, చుట్టూ ఉన్న వారికి గుర్తూ చేస్తూ మందు కొట్టడానికి ఇదో కారణం అన్నట్టుగా జీవితాంతం అక్కడే ఆగిపోతారు. ఇప్పుడు చంద్రబాబు కూడా రెండో రకంగానే ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన దారుణం అని చంద్రబాబు అంటుంటారు. అదో పీడకల […]

చంద్రబాబుకు పీడకలలంటే అంత ఇష్టమా?
X

ఏదైన ఒక అనుకోని చెడు సంఘటన జరిగితే సాధారణంగా రెండు రకాలుగా స్పందిస్తుంటారు జనం. ఒకటి.. గాయాన్ని మరిచిపోయి కొత్త జీవితం వైపు పాజిటివ్ కోణంలో అడుగులు వేస్తుంటారు కొందరు. మరికొందరు గాయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ, చుట్టూ ఉన్న వారికి గుర్తూ చేస్తూ మందు కొట్టడానికి ఇదో కారణం అన్నట్టుగా జీవితాంతం అక్కడే ఆగిపోతారు.

ఇప్పుడు చంద్రబాబు కూడా రెండో రకంగానే ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన దారుణం అని చంద్రబాబు అంటుంటారు. అదో పీడకల అని ఆయనే చెబుతుంటారు. కానీ అలాంటి పీడకల (రాష్ట్ర విభజన పీడకల అన్నది కొందరి అభిప్రాయం మాత్రమే) మరిచిపోయేలా రాష్ట్రాన్ని ముందుకు నడపాల్సిన సీఎం తెలివిగా ఆ గాయాన్ని ప్రతిసారి గుర్తు చేస్తున్నారు.

సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ఏపీని అగ్రస్థానంలో నిలబెడుతాం అంటూనే రాష్ట్ర విభజన దినాన్ని అదో దుర్దినంగా జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీకి అవతరణ దినోత్సవం కూడా లేకుండా చేశారు చంద్రబాబు. మంచికో చెడుకో రాష్ట్రం విడిపోయింది. కష్టపడితే ఏపీ కూడా పుంజుకోవడం ఖాయం. కానీ చంద్రబాబు రెండేళ్లుగా ఏడుపు రాగాన్ని తీస్తూ జనంలో లేనిపోని సెంటిమెంట్లు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు.

రాష్ట్ర విభజనతో ఏపీ జీరోకు పడిపోయిందని.. అలాంటి రాష్ట్రాన్ని స్వశక్తితో తెలివితేటలతో పైకి తెచ్చాను అని 2019 ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు పదేపదే నవనిర్మాణదీక్ష పేరుతో నాటకాలు రక్తికట్టిస్తున్నారు. విజయవాడ వచ్చే సరికి ఆకలికేకలు వేసే చంద్రబాబు తన సొంత అవసరాలకు మాత్రం వందలకోట్లు తగలేస్తారు.

దేశచరిత్రలో ఏ సీఎం చేయని విధంగా కుటుంబాన్ని తీసుకెళ్లి హోటల్‌లో కాపురం పెడుతారు. జనానికి మాత్రం కనీసం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం చేసుకునే భాగ్యం కూడా లేకుండా చేశారు. ఇంటికి పెద్దకొడుకులా ఉండే వ్యక్తి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి తగిలిన దెబ్బల నుంచి కోలుకునేలా చేయాలి. కానీ చంద్రబాబు మాత్రం ”పీడకలలను పదేపదే గుర్తు చేసుకుందాం… ఈ ఐదేళ్లలో తాను ఏమీ చేయలేకపోయినా అందుకు కారణం విభజనే అందాం” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

బీద ఏడుపులు ఏడుస్తున్న చంద్రబాబు దుబారాపై ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నమస్తే తెలంగాణ దిన పత్రికలో అచ్చయిన ఒక వాట్సప్ మెసేజ్ ఇది.

► బీద రాష్ట్రానికి,కట్టు బట్టలతో బయటకు పంపిన రాష్టానికి కాస్ట్ల్ లీ ముఖ్యమంత్రి

► ఇప్పటిదాకా బాబు ప్రభుత్వం దుబారా నిధుల మొత్తం 4వేల కోట్ల పైన … అవి సరిగా ఖర్చు పెట్టి ఉంటే ఈ పాటికి కేంద్రము వద్ద దేబరించవలసిన పని లేకుండా ఉండు .

బాబు చేసిన కేంద్ర నిధుల దుబారాలో కొన్ని ఖర్చులు
► ప్రమాణస్వీకారానికి చేసిన ఖర్చు …రూ 50 కోట్లు
► నీరు మీరు రూ150 కోట్లు
► హైదారాబాద్ లో ఇల్లు బాగు చెయ్యడానికి రూ. 20 కోట్లు
► ఖాళీ చేయబోతున్న సెక్రటేరియట్ రీమోడలింగ్ ఖర్చు రూ.20 కోట్లు
► కాన్వాయ్ లు అంటూ 3 చోట్ల కలిపి …..రూ. 30 కోట్లు
► బెజవాడ కాంప్ ఆఫీసు ……………….రూ. 20 కోట్లు
► ఖరీదు అయిన కొత్త బస్ కోసం ….. రూ. 5 కోట్లు
► బెజవాడ లో ఇల్లు అంటూ ……….రూ. 5 కోట్లు
► ఇంటికి దారులు, కరంట్ అంటూ ….రూ. 22 కోట్లు
► చంద్రన్న సంక్రాంతి అంటూ .. రూ.350 కోట్లు
► చంద్రన్న రంజాన్ అంటూ ఊడేసినది .. రూ.50 కోట్లు
► పట్టిసీమ అంటూ దోచిన సొమ్ము..రూ. 1350 కోట్లు
► పుష్కరాలు అంటూ సినిమా షూటింగ్ ల కోసం… రూ.250 కోట్లు
► ప్రత్యేక విమానాలు, విదేశాలు బూడిదలో పోసింది ..రూ. 75 కోట్లు
► అమరావతి పూజ(భూమి పూజ )రూ. 50 కోట్లు
► శంఖుస్థాపన అంటూ మట్టి మొహాన కొట్టించిన దానికి …రూ. 400 కోట్లు
► సంకల్ప సభ అని కే‌సి‌ఆర్ ని తిట్టడానికి పెట్టిన సభ ….రూ. 50 కోట్లు
► అమరావతి ఆహ్వానం కోసం కే‌సి‌ఆర్ ని ఇంటికి వెళ్ళి పిలవడానికి విమానం కోసం..రూ. 1 కోటి
► ఇక సభలు, సమావేశాలు, రైతు క్షేత్రం అంటూ ….రూ. 100 కోట్లు
మేధావులు,ప్రజాస్వామిక వాదులు, మీడియా సోదరులు, ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీనికి సమాధానం చెప్పాలి.
ఉపాధ్యాయులకు డి.ఎ అంటే నిధుల్లేవ్?ఏరియర్స్ కు నిధుల్లేవ్? పొదుపు పేరిట ఇప్పటికి 2 వేల పాఠశాలలు మూత.మళ్ళీ మరో 3 వేల పాఠశాలలు మూసివేతకు రంగం సిద్ధం.వెరసి 15 వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దు.
అవశేష ఆంద్రప్రదేశ్ లో నిరుద్యోగాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారు?

Click on Image to Read:

venkat-rami-reddy-botsa-sat

Poonam-Mahajan-1

paritala-sunitha-payavula

YS-Jagan

jogi-ramesh-comments-on-bal

jagan-yatra

Ashok-gajapathi-raju-Appar

jc-prabhakar-reddy

ap-employees

muddu-krishnama-naidu

renuka-chowdary

KE-Prabhakar-1

babu-purandeshwari

damodar-raja-narasimha

ashok-gajapati-raju

dgp-ramudu-paritala-sriram

First Published:  3 Jun 2016 3:05 PM IST
Next Story