అప్పారావును అశోక్ దగ్గర చేర్చిందెవరు?
ఆయుధ వ్యాపారి సంజయ్ భండారితో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఓఎస్‌డీ అప్పారావుకు ఉన్న సంబంధాల విషయంలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. వీటికి స్పందించి అశోక్ గజపతిరాజు ఓఎస్‌డీ అప్పారావు తప్పుచేసినట్లు తాను నమ్మడం లేదని, ఒకవేళ ఆయన తప్పుచేసివుంటే ఆ బాధ్యతనాదేనని మీడియాతో చెప్పారు. అశోక్ గజపతిరాజు నిప్పులాంటి మనిషి. ఆయన నిజాయితీని ఎవరు ప్రశ్నించలేరు. ఆయన అవినీతికి పాల్పడుతాడని ప్రజలు గానీ, నాయకులు గానీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వంగానీ నమ్మడంలేదు. అయితే ఆయన […]
ఆయుధ వ్యాపారి సంజయ్ భండారితో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఓఎస్‌డీ అప్పారావుకు ఉన్న సంబంధాల విషయంలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. వీటికి స్పందించి అశోక్ గజపతిరాజు ఓఎస్‌డీ అప్పారావు తప్పుచేసినట్లు తాను నమ్మడం లేదని, ఒకవేళ ఆయన తప్పుచేసివుంటే ఆ బాధ్యతనాదేనని మీడియాతో చెప్పారు.
అశోక్ గజపతిరాజు నిప్పులాంటి మనిషి. ఆయన నిజాయితీని ఎవరు ప్రశ్నించలేరు. ఆయన అవినీతికి పాల్పడుతాడని ప్రజలు గానీ, నాయకులు గానీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వంగానీ నమ్మడంలేదు.
అయితే ఆయన ఓఎస్‌డీని నియమించింది ఆంధ్రప్రదేశ్‌లో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి అని అందువల్లే ఓఎస్‌డీ అప్పారావు సంజయ్ భండారితో 355 సార్లు ఫోన్ సంభాషణలు జరిపితే, షాడో ముఖ్యమంత్రితో 790సార్లు షోన్ సంభాషణలు జరిపారని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావును నెత్తిమీద పెట్టుకుని మోస్తున్న కేంద్రమంత్రిగారే ఈ ఓఎస్‌డీ అప్పారావును అశోక్ ఆస్థానంలో చేర్చడంవెనుక ఉన్నారని మీడియా వార్తల వల్ల తెలుస్తోంది.
అశోక్ గజపతిరాజు అన్నట్టు ఓఎస్‌డీ అప్పారావు అమాయకుడే అయితే మంచిదే. అలా కాకుండా ఏమైనా అవినీతి వ్యవహారాలు నడిపివుంటే అశోక్ గజపతిరాజు బదనాంకాడు కానీ మిగతా ఇద్దరు రచ్చకెక్కుతారు.
Click on Image to Read: