పరిటాలకు భయపడి పారిపోయిన నువ్వా మాట్లాడేది..
తాను తలచుకుంటే జగన్‌ను తాడిపత్రి నియోజకవర్గం నుంచి పది నిమిషాల్లో తరిమేస్తానంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం మాజీ ఎంపీ, వైసీపీ నేత అనంతవెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌కు వార్నింగ్‌లిచ్చేంత సీన్ జేసీకి లేదని తేల్చేశారు. పరిటాల రవికి భయపడి బెంగళూరులో దాక్కున్న చరిత్ర జేసీ సోదరులది అన్నారు. తాము అప్పుడు ఇప్పుడు ఎవరికీ భయపడకుండా రాజకీయం చేస్తున్నామన్నారు. తమకు పదవులు, డబ్బు ముఖ్యం కాదని… అందుకే ప్రజలతో ఉంటున్నామన్నారు. టీడీపీనేతల బెదరింపులకు […]
తాను తలచుకుంటే జగన్‌ను తాడిపత్రి నియోజకవర్గం నుంచి పది నిమిషాల్లో తరిమేస్తానంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం మాజీ ఎంపీ, వైసీపీ నేత అనంతవెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌కు వార్నింగ్‌లిచ్చేంత సీన్ జేసీకి లేదని తేల్చేశారు. పరిటాల రవికి భయపడి బెంగళూరులో దాక్కున్న చరిత్ర జేసీ సోదరులది అన్నారు. తాము అప్పుడు ఇప్పుడు ఎవరికీ భయపడకుండా రాజకీయం చేస్తున్నామన్నారు. తమకు పదవులు, డబ్బు ముఖ్యం కాదని… అందుకే ప్రజలతో ఉంటున్నామన్నారు.
టీడీపీనేతల బెదరింపులకు భయపడేవారెవరూ ఇక్కడ లేరన్నారు. మరోవైపు టీడీపీ నేతల మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని వైసీపీ నేత బొత్ససత్యనారాయణ అన్నారు. యనమల మాససిక పరిస్థితిపై అనుమానం ఉందన్నారు. ఖజానా ఖాళీగా ఉంటే మరి అభివృద్ధి ఎలాచేస్తారని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు వ్యవస్థలపై గౌరవం లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రజలు కడుపుమంటతో ఉన్నారన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు… ఇప్పుడు జగన్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీకి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పేషీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్తే దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. అశోక్‌గజపతిరాజుకు పీఏగా అప్పారావును ఎవరు నియమించారు?. లోకేష్‌తో అప్పారావు లాలూచీ పడడం వంటి విషయాలన్నీ వెలుగులోకి రావాలన్నారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా అశోక్ గజపతిరాజు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు.
Click on Image to Read: