కోమటిరెడ్డి ఆ పదవి అడిగాడా?
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడో రేపో కారెక్కుతాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 2న గానీ, జూన్ 6న గానీ ఆయన పార్టీలో చేరతాడని వార్తలు వస్తున్నాయి. వీటిని ఇంతవరకూ కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరూ ఖండించలేదు. ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి వాళ్లెవరూ మీడియా ముందుకు రావడం లేదు. దీంతో ఈవార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు అయిన పాల్వాయి తదితరులు కోమటిరెడ్డి పార్టీని వీడినా నష్టమేం లేదని కామెంట్లు […]
BY admin2 Jun 2016 4:50 AM IST
X
admin Updated On: 2 Jun 2016 5:09 AM IST
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడో రేపో కారెక్కుతాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 2న గానీ, జూన్ 6న గానీ ఆయన పార్టీలో చేరతాడని వార్తలు వస్తున్నాయి. వీటిని ఇంతవరకూ కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరూ ఖండించలేదు. ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి వాళ్లెవరూ మీడియా ముందుకు రావడం లేదు. దీంతో ఈవార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు అయిన పాల్వాయి తదితరులు కోమటిరెడ్డి పార్టీని వీడినా నష్టమేం లేదని కామెంట్లు చేశారు. అయితే, కోమటిరెడ్డి చేరికపై నల్లగొండ జిల్లాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే.. వెంకటరెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టాడట. దానికి కేసీఆర్ అంగీకారం తెలిపాడట. అయితే, వెంకటరెడ్డి అడుగుతున్న శాఖ ఏంటంటే.. హోం వ్యవహారాలు. తెలంగాణకు ఎంతో కీలకమైన పదవి. ఏరాష్ట్రంలోనైనా హోం వ్యవహారాల శాఖ అంటే సీఎం తరువాత అంతటి ప్రాధాన్యమున్న శాఖ. ఏ సీఎం అయినా.. ఈ పదవిని వారి నమ్మిన బంట్లకే ఇస్తారు. ఇదే ఆనవాయితీ దాదాపుగా అన్ని రాష్ర్టాల్లో కొనసాగుతుంది. అదే విధంగా తెలంగాణలోనూ కేసీఆర్ హోంశాఖను తన నమ్మిన బంటు, ఉద్యమం మొదలైనప్పటి నుంచి తనతో ఉన్న నాయిని నరసింహారెడ్డికే అప్పగించారు.
మరి, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగినట్లుగా కేసీఆర్ ఆయనకు హోంశాఖ ఇస్తారా? అతని కోసం నాయిని ఆ పదవిని త్యాగం చేస్తాడా? అన్న విషయాలు ఇప్పుడు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా సాగుతోన్న చర్చలు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అంతటి ప్రాధాన్యమున్న పోస్టును ఎలా కట్టబెడతారు? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ ను కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖను నాయినికి ఇచ్చుకున్నారు. శాంతి భద్రతల విషయంలో కుటుంబ సభ్యులను కాదని, సీనియర్ వైపే మొగ్గుచూపిన కేసీఆర్ ఆ పదవిని ఎవరికీ ఇవ్వడని మరికొందరు వాదిస్తున్నారు. వెంకటరెడ్డి పార్టీలో చేరాక వీటిపై స్పష్టత వస్తుంది. అప్పటి దాకా ఇవన్నీ ఊహాగానాలేనని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.
Next Story