లోక్‌సభలో టీటీడీపీ ఖాళీ, అదే దారిలో మరికొందరు
తెలంగాణలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ మల్లారెడ్డి పార్టీ మారారు. సైకిల్ దిగి కారుఎక్కారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు మల్లారెడ్డి. ఆయన ప్రస్తుతం మల్కాజ్‌గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్ లో చేరుతున్నట్టు మల్లారెడ్డి చెప్పారు. తాను ఎక్కడా కూడా టీఆర్‌ఎస్‌ను గానీ, కేసీఆర్‌ను గానీ విమర్శించలేదని చెప్పారు. మల్లారెడ్డి బాటలోనే మరికొందరు నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజ్యసభ సీటు ఆశించి […]

తెలంగాణలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ మల్లారెడ్డి పార్టీ మారారు. సైకిల్ దిగి కారుఎక్కారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు మల్లారెడ్డి. ఆయన ప్రస్తుతం మల్కాజ్‌గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్ లో చేరుతున్నట్టు మల్లారెడ్డి చెప్పారు. తాను ఎక్కడా కూడా టీఆర్‌ఎస్‌ను గానీ, కేసీఆర్‌ను గానీ విమర్శించలేదని చెప్పారు. మల్లారెడ్డి బాటలోనే మరికొందరు నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజ్యసభ సీటు ఆశించి బాబు చేతిలో భంగపడ్డ ఇద్దరు నేతల్లో ఒకరు ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో వున్నట్టు సమాచారం.
Click on Image to Read: