అమ్మ బాబూ!.. సీటు కోసం ఇంత భారీ స్కెచ్ వేశారా?
రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు చివరివరకు ప్రయత్నించారు. 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న టీడీపీ మరో 15 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్లాన్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇదంత ఒక ఎత్తు అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్యసభ నాలుగో స్థానం కూడా కైవసం చేసుకోవాలని భావించిన చంద్రబాబు ఏకంగా ఓటింగ్ ప్రక్రియనే ప్రభావితం చేయబోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వెళ్లిన లేఖ ఇందుకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్ వేదికగా రాజ్యసభ ఓటింగ్ జరిగితే […]

రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు చివరివరకు ప్రయత్నించారు. 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న టీడీపీ మరో 15 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్లాన్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇదంత ఒక ఎత్తు అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్యసభ నాలుగో స్థానం కూడా కైవసం చేసుకోవాలని భావించిన చంద్రబాబు ఏకంగా ఓటింగ్ ప్రక్రియనే ప్రభావితం చేయబోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వెళ్లిన లేఖ ఇందుకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్ వేదికగా రాజ్యసభ ఓటింగ్ జరిగితే తమ వ్యూహం ఫలించదని భావించిన చంద్రబాబు.. ఓటింగ్‌ను విజయవాడకు మార్చేందుకు ప్రయత్నించారు. ఎన్నిక ప్రక్రియ వేదికను విజయవాడకు మార్చాల్సిందిగా కోరుతూ అసెంబ్లీ కార్యదర్శితో ఈసీకి చంద్రబాబు లేఖ రాయించారు. అందుకు చెప్పినకారణం కూడా ఆశ్చర్యంగానే ఉంది.
తెలంగాణలో అసాధారణ పరిస్థితులు ఉన్నాయని కాబట్టి ఎన్నిక వేదికను విజయవాడకు మార్చాల్సిందిగా కోరారు. అయితే ఈసీ ముందు బాబు ఎత్తులు పారలేదు. ఎన్నికలను విజయవాడకు మార్చడం కుదరదంటూ తిరిగి అసెంబ్లీ కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది. ఈ లేఖను ఒక పత్రిక యథాతథంగా ప్రచురించింది. ఈసీ నుంచి ఈ లేఖ వచ్చిన తర్వాతే నాలుగో అభ్యర్థిని నిలబెట్టే విషయంలో చంద్రబాబు వెనక్కు తగ్గారని చెబుతున్నారు. ఓటింగ్ విజయవాడలో జరిగితే వైసీపీ ఎమ్మెల్యేలను చివరి నిమిషం వరకు ప్రలోభపెట్టేందుకు అవకాశం ఉంటుందని, అధికార బలాన్ని కూడా ఉపయోగించే వీలవుతుందని బాబు ఎత్తు వేశారని అంటున్నారు. పోలీస్ యంత్రాంగం సాయంతో ఓటింగ్‌నే తారుమారు చేసేందుకు విజయవాడ అయితే అన్ని విధాలుగా బాగుంటుందని బాబు భావించారట. కానీ ఈసీ లొంగకపోవడంతో బాబు వ్యూహం పారలేదని చెబుతున్నారు.
Click on Image to Read: