Telugu Global
NEWS

బాబు చేతిలో బకరాలు అయింది వీరే...

పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి నేతకు తాను అండగా ఉంటానని ప్రతివేదికపైనా చంద్రబాబు చెబుతుంటారు. ఆ మాటలు చెప్పే ముందు చంద్రబాబు కళ్లలో నిజాయితీని ప్రదర్శిస్తుంటారు. దీంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని చాలా మంది నేతలు బతికేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు రాజ్యసభ సీటు కూడా ఆశించారు. కానీ ఆశ్చర్యం. పార్టీలు మారి వచ్చిన టీజీ వెంకటేష్‌కు అవకాశం ఇచ్చేశారు. నిజాయితీ గురించి మాట్లాడుతూనే బ్యాంకులకు వందల కోట్లు […]

బాబు చేతిలో బకరాలు అయింది వీరే...
X

పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి నేతకు తాను అండగా ఉంటానని ప్రతివేదికపైనా చంద్రబాబు చెబుతుంటారు. ఆ మాటలు చెప్పే ముందు చంద్రబాబు కళ్లలో నిజాయితీని ప్రదర్శిస్తుంటారు. దీంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని చాలా మంది నేతలు బతికేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు రాజ్యసభ సీటు కూడా ఆశించారు. కానీ ఆశ్చర్యం. పార్టీలు మారి వచ్చిన టీజీ వెంకటేష్‌కు అవకాశం ఇచ్చేశారు. నిజాయితీ గురించి మాట్లాడుతూనే బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరికి సీటు ఇచ్చారు. సుజనా సంగతి పక్కన పెడితే టీజీకి చాన్స్ ఇవ్వడంపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు చాలా కాలంగా ఏదో పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. గవర్నర్‌గా పంపుతామని మొదట్లో ఆయన్ను నమ్మించారు బాబు. కానీ అంతసినిమా లేదని తెలుసుకున్న మోత్కుపల్లి రాజ్యసభ కోరారు.

మహానాడు వేదికగా సిగ్గువిడిచి ”అలసిపోయాను, చేతిలో పది రూపాయలు కూడా లేవు మీరు ఆదుకోవాలి” అని వేలాది మంది కార్యకర్తల సమక్షంలో మోత్కుపల్లి గోడు వెళ్లబోసుకున్నారు. కానీ అసలు మోత్కుపల్లిని పరిగణలోకే తీసుకోలేదు. మూడు రోజుల క్రితం టీడీపీ పొలిట్‌ బ్యూరో భేటీ జరిగింది. ఈ భేటీలో రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారు గదిలో నుంచి బయటకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆ సమయంలో మోత్కుపల్లి, సుజనా, రావుల చంద్రశేఖర్ రెడ్డి బయటకు వచ్చేశారు. కానీ రావుల పేరును కూడా పరిశీలించలేదు. రాజ్యసభకు పుష్పరాజు పేరును టీడీపీ నేతలు పెద్దెత్తున ప్రచారం చేశారు. కానీ ఆయనకు మొండి చేయే దక్కింది.

నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరి నేతలు గట్టిగా ప్రయత్నించారు. కానీ వారికి కూడా బాబు హ్యాండిచ్చారు. కాపులకు ఈసారి అవకాశం ఇస్తారని ఎదురుచూశారు. అయినప్పటికీ బాబు డబ్బు వైపే మొగ్గుచూపినట్టుగా ఉంది. ఇలా దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని చంద్రబాబు బురిడీ కొట్టించారు. పార్టీ మారి వచ్చిన వ్యాపారవేత్త టీజీకి పట్టంకట్టారు. సుజనా, టీజీ ఇద్దరూ కూడా పారిశ్రామికవేత్తలే. వీరికి అవకాశం దక్కడం వెనుక వందలకోట్లు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. టీజీ పేరును ఎవరూ కూడా పెద్దగా ఊహించలేదు. అలాంటి వ్యక్తికి సైలెంట్‌గా టికెట్‌ ఇచ్చేశారు. డీల్ ఓకే అంటూ చినబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చంద్రబాబు టీజీ పేరును ఖరారు చేశారని చెబుతున్నారు. టీజీకి కాకుండా పార్టీనే నమ్మకుని మొదటి నుంచి ఉన్న మరో వ్యక్తికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని సీనియర్లు చెబుతున్నారు. గతంలో కూడా పెద్దమొత్తం డబ్బులు తీసుకొని దేవేందర్ గౌడ్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయులు గుర్తుచేసుకుంటున్నారు.

Click on Image to Read:

Topudurti-prakash-reddy

bhumana-sv-university

babu-raghuveera

tdp-leder-join-to-trs

bhumana-karunakar-reddy

cpi narayana comments on chandrababu naidu

babau-paper

chandrababu-fire

TDP-Politburo-Meeting

kvp ramachandra rao,

First Published:  31 May 2016 4:20 AM IST
Next Story