తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో శ్రీనివాస్‌గౌడ్‌కు ఆహ్వానం అందలేదా?
తెలంగాణ ఉద్యమసమయంలో ప్రముఖంగా వినిపించిన ఉద్యమనేతల్లో శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా ముందువరుసలో ఉంటుంది. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారిగా ఉంటూనే స్థానిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పాలమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్‌కు విధేయుడు అన్న పేరు కూడా సంపాదించాడు. తెలివైనవాడు, విద్యావంతుడు, పైగా జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా పలుచోట్ల విధులు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం కావడంతో.. ఒక దశలో ఆయనకు మంత్రి పదవి […]
BY sarvi31 May 2016 7:09 AM IST
X
sarvi Updated On: 31 May 2016 7:45 AM IST
తెలంగాణ ఉద్యమసమయంలో ప్రముఖంగా వినిపించిన ఉద్యమనేతల్లో శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా ముందువరుసలో ఉంటుంది. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారిగా ఉంటూనే స్థానిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పాలమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్‌కు విధేయుడు అన్న పేరు కూడా సంపాదించాడు. తెలివైనవాడు, విద్యావంతుడు, పైగా జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా పలుచోట్ల విధులు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం కావడంతో.. ఒక దశలో ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని కూడా పార్టీలో చర్చజరిగింది. పార్టీలోనూ ఈయనకు మంచి వెయిటేజీ ఉంది. అందులో సందేహం అక్కర్లేదు. మరి ఇంత నేపథ్యం ఉన్న ఉద్యమనేతకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందకపోతే ఎలా ఉంటుంది? తప్పకుండా అరికాలి మంట నెత్తికెక్కుతుంది. అందుకే, ఈ పరిణామానికి కారణమైన వారిని కడిగిపారేశాడు.
అధికారులను కడిగిపారేశాడు..!
సోమవారం జరిగిన జెడ్పీసమావేవంలో శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. అధికారుల తీరుపై మండిపడ్డాడు. కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకైనా తనకు ఆహ్వానం ఎందుకు పంపలేదని నిలదీశారు. ఉద్యమకారుడన్న గుర్తింపు, ఎమ్మెల్యే అన్న కనీస మర్యాద పాటించరా? అని వారిని కడిగిపారేశారు. దీనిపై అక్కడే ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు సైతం ఫిర్యాదు చేశారు. అతనితోపాటు పలువురు సభ్యులు కూడా మంత్రికి అధికారుల తీరుపై ఫిర్యాదులు చేశారు. శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన అర్థం చేసుకున్న మంత్రి జూపల్లి ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
Next Story