ఏపీలో ఏకగ్రీవమే
అధర్మాన్ని రోడ్డెక్కించడం ఈజీయే. కానీ గమ్యాన్ని చేర్చడం కష్టం. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగింది. చేతిలో అధికారం, జేబులో ధనం ఉందన్న అహంకారంతో ఎమ్మెల్యేలను హోల్‌సేల్‌గా కొనేసి రాజకీయం నడపాలనుకున్న చంద్రబాబు చివరకు చేతులెత్తేయక తప్పలేదు. వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కకుండా చేసేందుకు నాగుపాము తరహాలో వంపులు తిరుగుతూ రాజకీయం నడిపిన టీడీపీకి చివరకు అసలు చిత్రం అర్థమైంది. మనుషుల్లోనూ అమ్ముడుపోయే మనుషులు కొందరేనని తేలిపోయింది. 17 మందిని కొనేసిన టీడీపీ మరో 15 […]
అధర్మాన్ని రోడ్డెక్కించడం ఈజీయే. కానీ గమ్యాన్ని చేర్చడం కష్టం. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగింది. చేతిలో అధికారం, జేబులో ధనం ఉందన్న అహంకారంతో ఎమ్మెల్యేలను హోల్‌సేల్‌గా కొనేసి రాజకీయం నడపాలనుకున్న చంద్రబాబు చివరకు చేతులెత్తేయక తప్పలేదు. వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కకుండా చేసేందుకు నాగుపాము తరహాలో వంపులు తిరుగుతూ రాజకీయం నడిపిన టీడీపీకి చివరకు అసలు చిత్రం అర్థమైంది. మనుషుల్లోనూ అమ్ముడుపోయే మనుషులు కొందరేనని తేలిపోయింది. 17 మందిని కొనేసిన టీడీపీ మరో 15 మందిని కొనేద్దామనుకుంది. కానీ రెండుమూడు నాసిరకం విత్తనాలు తప్ప అంతకు మించి ఆపరేషన్ ప్రలోభకు లొంగే ఎమ్మెల్యేలు లేరని తేలిపోవడం బాబు ప్లేట్ ఫిరాయించారు.
నామినేషన్‌కు మరోరోజుగడువు ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను విజయవాడ పిలిపించుకున్న చంద్రబాబు… వైసీపీలో ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకురాగలమని ప్రశ్నించారు. కానీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకువచ్చేంత సినిమా తమకులేదని ఫిరాయింపుదారులు చెప్పేయడంతో బాబు వ్యూహం అప్పుడే పతనం అంచుకుచేరింది. అప్పటికే కొండంత రాగం తీసేసిన చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకుని …. నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అన్నది ఫిరాయించిన 17మంది ఎమ్మెల్యేలే నిర్ణయించుకుంటారని చెప్పి సైడ్ ట్రాక్‌పైకి దూకేశారు. అసలు నిజంగా నాలుగో సీటు గెలిచే సినిమా ఉంటే ఫిరాయింపుదారుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే నాయకుడేనా చంద్రబాబు?.
బాబువ్యూహాన్ని దెబ్బకొట్టడంతో వైసీపీ కూడా కొద్దిమేర తెలివిగానే వ్యవహరించిందని చెప్పాలి. ఆఖరి నిమిషాల్లో మరో 15 మంది ఎమ్మెల్యేలను హోల్‌సేల్‌గా కొనేయాలని టీడీపీ భావించింది. కానీ ఎమ్మెల్యేలు బాబు బ్యాచ్‌కు చిక్కకుండా చేయడంలో ఆ పార్టీ విజయం సాధించింది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల విషయంలో చంద్రబాబుకు దక్కింది దేశంలో ఇలాంటి రాజకీయాలు నడిపే వ్యక్తి మరొకరు ఉండరన్న మచ్చలు మాత్రమే.
రాజ్యసభ సీట్లను వందలకోట్లకు అమ్ముకోవడం చంద్రబాబుకు అలవాటేనన్న భావన మరింత బలపడింది. దళితుడైన పుష్పరాజును ఊరించి చివరకు కోటీశ్వరుడైన టీజీకి కట్టబెట్టడం ద్వారా టీడీపీలో అవకాశాలు దక్కాలంటే సంపాదించుకోవాల్సింది మంచిపేరు కాదు ”మనీ” అని మరోసారి బాబు నిరూపించారు. అయినా బాబు వ్యూహాలుబెడిసికొట్టడం కొత్తకాదు.. ”నో వాట్ ఐయామ్ సేయింగ్” అంటూ ఆయన కవరు చేసుకోవడమూ కొత్తకాదు.
Click on Image to Read: