ఇక అన్నదమ్ముల పోరేనా?
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ పార్టీలో.. ముఖ్యంగా నల్లగొండ జిల్లాల్లో రామలక్ష్మణులన్న పేరు ఉంది. ఇకపై వీరు పార్టీపరంగా విరోధులుగా మారనున్నారా? లేక అన్న తరువాత తమ్ముడు కూడా కారెక్కుతాడా? అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం. తమ్ముడి కోసం అన్న ప్రాణమిస్తాడు. అన్న కోసం తమ్ముడు ఏదైనా చేస్తాడు. వీరిద్దరూ కలిసి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. పలుమార్లు పార్టీపరంగా.. కుటుంబపరంగా ఎవరికి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా.. […]
BY sarvi31 May 2016 8:11 AM IST
X
sarvi Updated On: 31 May 2016 8:11 AM IST
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ పార్టీలో.. ముఖ్యంగా నల్లగొండ జిల్లాల్లో రామలక్ష్మణులన్న పేరు ఉంది. ఇకపై వీరు పార్టీపరంగా విరోధులుగా మారనున్నారా? లేక అన్న తరువాత తమ్ముడు కూడా కారెక్కుతాడా? అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం. తమ్ముడి కోసం అన్న ప్రాణమిస్తాడు. అన్న కోసం తమ్ముడు ఏదైనా చేస్తాడు. వీరిద్దరూ కలిసి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. పలుమార్లు పార్టీపరంగా.. కుటుంబపరంగా ఎవరికి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా.. ఒకరికొకరు తోడుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కారెక్కిస్తోన్న టీఆర్ ఎస్ పార్టీలోకి అన్న కోమటిరెడ్డి వెళుతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై ఇంతవరకూ కోమటిరెడ్డి స్పందించలేదు. వీటిని ఖండించలేదు.. అలాగని అంగీకరించలేదు. దీంతో కోమటిరెడ్డి మౌనం దేనికి సంకేతం అన్న చర్చ? మీడియాలో ఊపందుకుంది.
2014 ఎన్నికల్లో భువనగిరి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే, భువనగిరి నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులంతా ఓడిపోవడంతో సహజరంగా రాజగోపాల్ రెడ్డి కూడా పరాజయం పాలయ్యారు. తన పరిధిలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల తప్పుడు సమీకరణాలు తన ఓటమికి కారణమయ్యాయని రాజగోపాల్ రెడ్డి పలువురి వద్ద వాపోయాడని సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినపుడు తమ్ముడి విజయానికి అహర్నిశలు శ్రమించాడు వెంకటరెడ్డి. తన తమ్ముడు ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతానని కూడా భీష్మశపథం చేశాడు. దగ్గరుండి తమ్ముడిని మండలి ఎన్నికల్లో విజయం సాధించేలా చేసుకుని తన పంతం నెగ్గించుకున్నాడు. మరి ఇప్పుడు తమ్ముడు పార్టీ మారకపోతే.. పార్టీ పరంగా ఇద్దరూ బద్దశత్రువులయ్యే ప్రమాదముంది. అదే సమయంలో తనను గెలిపించుకునేందుకు తన భవిష్యత్తునే పణంగా పెట్టిన అన్న కోమటిరెడ్డి వెంట కారెక్కుతాడా? లేదా తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వెంట ఉంటాడా? అన్న సందిగ్ధం రాజకీయాల్లో నెలకొంది.
Next Story