ఇలా అయితే ఎమ్మెల్యేలంతా వెళ్లిపోతారన్నాడు- జగన్‌పై జ్యోతుల
రాజ్యసభ రేసులో నాలుగో అభ్యర్థిని నిలబెట్టేందుకు చివరి వరకు ప్రయత్నించి విఫలమైన టీడీపీని వెనుకేసుకొచ్చేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. నాలుగో అభ్యర్థిని నిలబెడితే గెలిచితీరుతామని తాము చెప్పినా విలువకోసం కట్టుబడి చంద్రబాబు పోటీ పెట్టలేదని భూమా వ్యాఖ్యానించగా…జ్యోతుల కూడా టీడీపీని సమర్ధించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే తల్లి ఆపరేషన్ కోసం రూ. 5లక్షలు అవసరమైతే సీఎం చంద్రబాబు దగ్గరకు తానే తీసుకెళ్లానని జ్యోతుల చెప్పారు. ఈ విషయాన్ని జగన్‌కు […]
రాజ్యసభ రేసులో నాలుగో అభ్యర్థిని నిలబెట్టేందుకు చివరి వరకు ప్రయత్నించి విఫలమైన టీడీపీని వెనుకేసుకొచ్చేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. నాలుగో అభ్యర్థిని నిలబెడితే గెలిచితీరుతామని తాము చెప్పినా విలువకోసం కట్టుబడి చంద్రబాబు పోటీ పెట్టలేదని భూమా వ్యాఖ్యానించగా…జ్యోతుల కూడా టీడీపీని సమర్ధించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే తల్లి ఆపరేషన్ కోసం రూ. 5లక్షలు అవసరమైతే సీఎం చంద్రబాబు దగ్గరకు తానే తీసుకెళ్లానని జ్యోతుల చెప్పారు. ఈ విషయాన్ని జగన్‌కు చెప్పగా అలా ఎమ్మెల్యేలను సీఎం దగ్గరకు తీసుకెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ”ఇలా తీసుకెళ్తే ఎమ్మెల్యేలంతా వెళ్లిపోతారు కదా అన్నా” అని జగన్ వ్యాఖ్యానించారని అప్పుడు తనకు ఆశ్చర్యమేసిందన్నారు. టీడీపీ తనను కొనుక్కోలేదని…తాను వైసీపీలో చేరినప్పుడు జగన్ ఎంతకు కొన్నారో చెప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధిపై శ్రద్ధ ఉన్నా…వారికి పార్టీలో స్వేచ్చలేదని జ్యోతుల నెహ్రు ఆరోపించారు. వైసీపీది ఏక నాయకత్వమని ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు.
Click on Image to Read: