రేవంత్ వ్యాఖ్యలు వైఎస్ గురించేనా?
పిచ్చోడి చేతిలో రాయి.. రేవంత్ రెడ్డి చేతిలో మైకు రెండూ ఒకటేనంటున్నారు.. ఆయన ప్రత్యర్థులు. ఓటుకు నోటు కేసుకు ముందు ఆయన ఏం మాట్లాడినా.. మంచి సబ్జెక్టు ఉన్న నాయకుడు అనిపించుకునేవారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయినప్పటి నుంచి ఆయనలో విపరీత ధోరణి రానురాను పెరిగిపోతోంది. రాజకీయంగా ప్రత్యర్థులను విమర్శించడం ఏనాడో మానేశారు.. వేదిక ఎక్కి మైకు దొరికితేచాలు.. తిట్లు, శాపనార్థాలు తప్ప మరేం ఉండటం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో అయితే చెప్పనవసరం లేదు. […]
BY sarvi30 May 2016 7:11 AM IST
X
sarvi Updated On: 30 May 2016 8:28 AM IST
పిచ్చోడి చేతిలో రాయి.. రేవంత్ రెడ్డి చేతిలో మైకు రెండూ ఒకటేనంటున్నారు.. ఆయన ప్రత్యర్థులు. ఓటుకు నోటు కేసుకు ముందు ఆయన ఏం మాట్లాడినా.. మంచి సబ్జెక్టు ఉన్న నాయకుడు అనిపించుకునేవారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయినప్పటి నుంచి ఆయనలో విపరీత ధోరణి రానురాను పెరిగిపోతోంది. రాజకీయంగా ప్రత్యర్థులను విమర్శించడం ఏనాడో మానేశారు.. వేదిక ఎక్కి మైకు దొరికితేచాలు.. తిట్లు, శాపనార్థాలు తప్ప మరేం ఉండటం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో అయితే చెప్పనవసరం లేదు. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి అన్న కనీస మర్యాద పాటించకుండా ఇష్టమున్నట్లు తిడుతున్నాడు. బతికున్న వారి సంగతి పక్కనబెడితే… మరణించిన వారి విషయంలోనూ కనీస మర్యాద పాటించడం లేదు. గతంలో వైఎస్ జగన్ ను విమర్శించే క్రమంలో ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావురాల గుట్టలో పావురం అయిపోయాడు.. అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఇవి వైఎస్ అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి.
మహానేత వైఎస్ ఒక్కరే కదా!
తాజాగా కేసీఆర్ ని విమర్శించే క్రమంలో రేవంత్ రెడ్డి మరింత చెలరేగిపోయారు. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వారెవరూ బతికి బట్టకట్టింది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా పెట్టుకున్న మహానాయకులు ఎవరూ..బతికి బట్టకట్టలేదని.. గాల్లో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఏపీలో మహానాయకుడిగా పేరు గాంచింది వైఎస్ ఒక్కరే. అంటే రేవంత్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉద్దేశపూర్వ వ్యాఖ్యలు చేయడం సభామర్యాద కాదని మండిపడుతున్నారు. చనిపోయిన వారి విషయంలో పాటించాల్సిన కనీస విజ్ఞత ఇది కాదని హితవు పలుకుతున్నారు. నోరు ఉంది కదా.. మైకు దొరికింది కదా..! అని ఇష్టానుసారంగా మట్లాడితే.. జనాల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Next Story