Telugu Global
NEWS

నీ కులగజ్జి ఇప్పటికీ ఎస్వీలో పారుతోంది, నీ ఇంటిలో సీసీ కెమెరాలు పెట్టుకో!

మహానాడు వేదిక నుంచి తనకు కులపిచ్చి, మతపిచ్చి లేదని చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైందే కులగజ్జితో అని విమర్శించారు. చంద్రబాబు సృష్టించిన కులగజ్జి ఇప్పటికీ ఎస్వీ యూనివర్శిటీలో ప్రవహిస్తోందన్నారు. చంద్రబాబును మించి కులపిచ్చి ఉన్నవారు మరొకరు లేరని భూమన ఫైర్ అయ్యారు. కులగజ్జితోనే చంద్రబాబు పైకి వచ్చారన్నారు. వెంకటేశ్వరస్వామికి వైభవం తెచ్చింది తామేనని చంద్రబాబు చెప్పుకోవడంపైనా భూమన విమర్శలుచేశారు. 32వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య, ఏడుసార్లు […]

నీ కులగజ్జి ఇప్పటికీ ఎస్వీలో పారుతోంది, నీ ఇంటిలో సీసీ కెమెరాలు పెట్టుకో!
X

మహానాడు వేదిక నుంచి తనకు కులపిచ్చి, మతపిచ్చి లేదని చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైందే కులగజ్జితో అని విమర్శించారు. చంద్రబాబు సృష్టించిన కులగజ్జి ఇప్పటికీ ఎస్వీ యూనివర్శిటీలో ప్రవహిస్తోందన్నారు. చంద్రబాబును మించి కులపిచ్చి ఉన్నవారు మరొకరు లేరని భూమన ఫైర్ అయ్యారు. కులగజ్జితోనే చంద్రబాబు పైకి వచ్చారన్నారు. వెంకటేశ్వరస్వామికి వైభవం తెచ్చింది తామేనని చంద్రబాబు చెప్పుకోవడంపైనా భూమన విమర్శలుచేశారు.

32వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య, ఏడుసార్లు వెంకన్న దర్శనానికి వచ్చిన మహాచక్రవర్తి కృష్ణదేవరాయులు, శంకరాచార్యుల సేవలను కూడా కనుమరుగు చేసేలా టీడీపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ నారా చంద్రబాబస్వాముల వారు వ్యవహరిస్తున్నారని భూమన అన్నారు. హిందూధార్మికతపై చంద్రబాబు చావు దెబ్బలు కొడుతున్నారని విమర్శించారు. భగవంతుడి పట్ల చంద్రబాబు చేసిన అపచారం అంతాఇంతా కాదన్నారు. చంద్రబాబు అమీబా జాతికి చెందిన వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పే దుర్మార్గుడు ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు.

వైసీపీనేరాలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు పెడుతానంటున్న చంద్రబాబు ముందు సొంత ఇంటిలోనే సీసీ కెమెరాలను పెట్టుకోవాలని సూచించారు. సీఎం నివాసం, కార్యాలయం, సీఎం రమేష్, సుజనాచౌదరి కార్యాలయాల్లోనే అన్ని లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్కడన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టి ప్రజలకు అణుక్షణం చూపించాలన్నారు. చంద్రబాబు ఒక మానసిక వికారస్థితికి చేరుకున్నారని భూమన మండిపడ్డారు.

Click on Image to Read:

bhumana-karunakar-reddy

babau-paper

chandrababu-fire

TDP-Politburo-Meeting

kvp ramachandra rao,

kvp-jagan

mp-shiva-prasad

prabhakar-ramoji-rao

lokesh-pm

lokesh-mahanadu-speech

chandrababu-mahanadu-speach

YS-Jagan-NTR

ys-raja-reddy

First Published:  30 May 2016 7:45 AM IST
Next Story