ఓటుకు నోటు కేసుపై ప్రత్యేక కథనాలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఓటుకు నోటు కుంభకోణం.. సరిగ్గా ఏడాది క్రితం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో తెలుగు రాష్ర్టాలతోపాటు దేశం యావత్తూ ఉలిక్కి పడింది. చంద్రబాబు కుట్ర బట్టబయలైంది. మే 31న సాయంత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి మొదట బుకాయించాడు. సీఎం కేసీఆర్ తనను అన్యాయంగా ఇరికించాడని ఆరోపించాడు. ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు తిట్టాడు. […]
BY sarvi29 May 2016 2:30 AM IST
X
sarvi Updated On: 29 May 2016 9:18 AM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఓటుకు నోటు కుంభకోణం.. సరిగ్గా ఏడాది క్రితం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో తెలుగు రాష్ర్టాలతోపాటు దేశం యావత్తూ ఉలిక్కి పడింది. చంద్రబాబు కుట్ర బట్టబయలైంది. మే 31న సాయంత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి మొదట బుకాయించాడు. సీఎం కేసీఆర్ తనను అన్యాయంగా ఇరికించాడని ఆరోపించాడు. ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు తిట్టాడు. మీసం మెలేశాడు.. తొడగొట్టాడు.. అబ్బో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ఇక రాత్రి 10 గంటల సమయంలో రేవంత్ రెడ్డి డబ్బులు ఆశచూపుతూ స్టీఫెన్ సన్ ను మభ్య పెడుతుండగా రహస్యంగా తీసిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ మారాయి. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో బోరుమన్నాడట. తన రాజకీయ జీవితం నాశనమైందని కుమిలికుమిలి ఏడ్చాడట. తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టె చేశారంటూ అప్పటి తెలుగుదేశం నేత ఎర్రబెల్లితో సహా పలువురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అప్పుడే టీవీలో రేవంత్ రెడ్డి లంచం ఇస్తుండగా తీసిన వీడియోలు ప్రసారమయ్యాయి. దీంతో మారు మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుని ఇంటిబాట పట్టారు సదరు నేతలు.
సాక్షి, ఇతర మీడియాలో…
తెలుగు రాష్ర్టాలను కుదుపు కుదిపిన ఈ కుంభకోణం రాజకీయ వేడిని రాజేసింది. రెండు రోజుల వ్యవధిలో చంద్రబాబు సైతం మాట్లాడిన ఆడియో టేపులు బహిర్గతం కావడంతో టీడీపీ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. అయితే, ఈ వ్యవహారాన్ని టీడీపీ అనుకూల మీడియా బాగా తగ్గించి చూపించాలని ప్రయత్నించినా.. సోషల్ మీడియా పుణ్యమా అని చూపించక తప్పలేదు. దీంతో చంద్రబాబు నిజస్వరూపం బయటపెడతామన్న కేసీఆర్ తన పంథం, శపథం నెరవేర్చుకున్నారు. ఈ ఘటన ముగిసి ఏడాది కావడంతో ఇప్పుడు సాక్షి, సహా పలు మీడియాలు ప్రత్యేక కథనాలు తయారు చేస్తున్నాయి. ఓవైపు తిరుపతిలో టీడీపీ మహానాడు జరుగుతుండగానే.. మరోవైపు మీడియాలో ఆపార్టీ నేత పాల్పడ్డ కుట్రను పథాక శీర్షికలన, ప్రత్యేక కార్యక్రమాల రూపంలో ప్రసారం చేస్తుండటంతో టీడీపీ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు.
Next Story