ఏడాదైనా నెరవేరని రేవంత్, చంద్రబాబుల శపథాలు!
ఓటుకు నోటు కుంభకోణం కేసు అనంతరం తెలుగుదేశం నేతలు మంగమ్మ శపథాలు చేశారు. ఆ తరువాత తోకముడిచి పారిపోయారు. స్టీఫెన్ సన్ ఇంట్లో లంచం ఇస్తూ పట్టుబడ్డ రేవంత్ మీసాలు మెలేసి తొడగొట్టి ఓ మాట అన్నాడు. కేసీఆర్‌ను పోలీసులతో అరెస్టు చేయించి… తీరుతానని శపథం చేశాడు. ఆ తరువాత చర్లపల్లి జైలులో ఊచలు లెక్కబెట్టి వచ్చాడు. ఏడాది అవుతున్నా.. ఆయన శపథం నెరవేరలేదు. ఇక తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను తెలంగాణ ప్రభుత్వం […]
BY sarvi29 May 2016 2:54 AM IST
X
sarvi Updated On: 29 May 2016 9:10 AM IST
ఓటుకు నోటు కుంభకోణం కేసు అనంతరం తెలుగుదేశం నేతలు మంగమ్మ శపథాలు చేశారు. ఆ తరువాత తోకముడిచి పారిపోయారు. స్టీఫెన్ సన్ ఇంట్లో లంచం ఇస్తూ పట్టుబడ్డ రేవంత్ మీసాలు మెలేసి తొడగొట్టి ఓ మాట అన్నాడు. కేసీఆర్‌ను పోలీసులతో అరెస్టు చేయించి… తీరుతానని శపథం చేశాడు. ఆ తరువాత చర్లపల్లి జైలులో ఊచలు లెక్కబెట్టి వచ్చాడు. ఏడాది అవుతున్నా.. ఆయన శపథం నెరవేరలేదు. ఇక తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ అరెస్టు చేస్తుందో అన్న ఆందోళన ఆయన మాటల్లోనే కనిపించింది. తనను అరెస్టు చేయాలని చూస్తే.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తానని హెచ్చరించాడు. జాతీయ మీడియా ముందు శపథం చేసిన చంద్రబాబును మీడియా ప్రతినిధులు అక్కడే నిలదీసినంత పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారు? అని వెంటనే ప్రశ్నించేసరికి బాబు నీళ్లునమిలాడే తప్ప సమాధానం చెప్పలేదు. రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి ప్రముఖులతో జరిగిన ఇంటర్వ్యూల్లోనూ చంద్రబాబు నసిగాడే తప్ప.. ఎక్కడా ఆడియో టేపుల్లోని గొంతు తనదేనని ఒప్పుకోలేదు. సూటిగా సమాధానం చెప్పలేదు. ఒకసారి తనదే అంటాడు. మరోసారి కాదంటాడు. ఇంటర్వ్యూ చేసిన వారికి పిచ్చి ఎక్కేలా చేశాడు.
అమరాతిలో జెండా పాతాడు
తెలంగాణలో ఏపీ పోలీసు స్టేషన్‌లు పెడతాం.. సెక్షన్-8 అమలు చేస్తాం.. అంటూ నెత్తీనోరు బాదుకున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ తరువాత ఏం జరిగిందో? ఏమో తెలియదు కానీ, ఉన్నపళంగా హైదరాబాద్ నుంచి మాయమయ్యాడు. ఏపీ నూతన రాజధాని అమరావతిలో జెండా పాతేశాడు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అంటూ ప్రగల్బాలు పలికి.. ఉన్నపళంగా ఎందుకు అమరావతికి ఎందుకు వెళ్లాడు? అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తాయని తెలిసి కేసీఆర్‌తో రాజీకీ వచ్చాడని, అందుకే ఒప్పందం మేరకు తెలంగాణ నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఇటు కేసీఆర్ గానీ, అటు చంద్రబాబు గానీ నోరుమెదపడం లేదు. ఏదేమైనా కేంద్రంలో భాగస్వామ్యం అయ్యాం కదా! అని ఎక్కడపడితే అక్కడ వేలుపెట్టి పీకల మీదకు తెచ్చుకున్నారు తెలుగుదేశం నేతలు. రేవంత్, చంద్రబాబు శపథాలకు ఏడాది పూర్తవుతున్నా.. ఇంతవరకూ నెరవేరలేదు పాపం!
Next Story