కట్టప్ప..చంద్రప్ప రహస్యాలు తెలిసిపోయాయి!
బాహుబలిని నమ్మినబంటు కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? 2015 నుంచి మొన్నటి దాకా భారతీయులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం చూసిన ప్రేక్షకులను వేధించిన ప్రశ్న ఇది. దాదాపుగా ఏడాదిపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ ప్రశ్నకు ఇటీవల రాజమౌళి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను దర్శకుడిని కాబట్టి.. తన ఆదేశాల మేరకు కట్టప్ప బాహుబలిని చంపాడని వెల్లడించి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఏపీ సీఎం చంద్రప్ప అదేనండి చంద్రబాబు ఉన్నట్లుంది […]
BY sarvi29 May 2016 5:33 PM IST
X
sarvi Updated On: 1 Jun 2016 7:13 AM IST
బాహుబలిని నమ్మినబంటు కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? 2015 నుంచి మొన్నటి దాకా భారతీయులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం చూసిన ప్రేక్షకులను వేధించిన ప్రశ్న ఇది. దాదాపుగా ఏడాదిపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ ప్రశ్నకు ఇటీవల రాజమౌళి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను దర్శకుడిని కాబట్టి.. తన ఆదేశాల మేరకు కట్టప్ప బాహుబలిని చంపాడని వెల్లడించి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఏపీ సీఎం చంద్రప్ప అదేనండి చంద్రబాబు ఉన్నట్లుంది అమరావతికి ఎందుకు వెళ్లాడు? ఇది నేటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని వేధించిన మరో ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ రహస్యం తనంతట తానుగా చెప్పలేదు. మరి ఎలా తెలిసిందనేనా మీ ప్రశ్న.
రాజ్యసభ ఎన్నికలే ఆ గుట్టు విప్పాయి..
చంద్రప్ప హైదరాబాద్ వదిలి అమరావతికి ఎందుకు వెళ్లిపోయాడంటే.. తెలంగాణలో అసాధారణ పరిస్థితులు ఉన్నాయంట. ఇక్కడ ప్రతీదానికి తెలంగాణ సర్కారు పై ఆధారపడాల్సి వస్తుందట. ఇక్కడ ఉన్న అసాధారణ పరిస్థితులు, ముఖ్యంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి అస్సలు అనుకూలంగా లేవంట. ఈవిషయం చంద్రప్ప గారికి ఎప్పుడు తెలిసిందంటే.. ఓటుకు నోటు కేసులో వారి ఎమ్మెల్యే పట్టుబడ్డప్పుడు. ఆ వెనువెంటనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న టేపులు బయటికి వచ్చినపుడు ఈ ఆందోళన రెట్టింపయిందట. ఇక లాభం లేదు. తెలంగాణలో మాపై కేసులు పెడుతున్నారు. ఇది తప్పకుండా అసాధారణమే! అనుకుని అమరావతికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్నయినా నేరుగా చెప్పారా అంటే అదీ గాదు. మరి లోకానికి ఎలా తెలిసిందనుకుంటారా? టీడీపీ తరఫున నాలుగో అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నంలో రాజ్యసభ ఎన్నికను హైదాబాద్ నుంచి విజయవాడకు మార్చాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శితో ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు చంద్రప్ప. తెలంగాణలో అసాధరణ పరిస్థితులున్నాయని, అక్కడ ఉండలేకపోతున్నామని అందులో మొరపెట్టుకున్నారు. కానీ ఎన్నికల సంఘం ససేమీరా అంది. కానీ, ఆ లేఖ ఇప్పుడు బయటపడింది. ఇలా చంద్రప్ప అమరావతికి ఎందుకు వెళ్లాడన్న రహస్యం ఎన్నికల సంఘం బయటపెట్టింది?
Next Story