ఫిరాయింపు ఎమ్మెల్యేను గేటు బయటే నిలబెట్టిన పోలీసులు
తిరుపతిలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పార్టీ ఫిరాయించిన నేతలకు అవమానం జరిగింది. విశాఖ జిల్లాకు చెందిన అరకు వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలను మహానాడు మెయిన్ గేటు వద్దే పోలీసులు ఆపేశారు. వీరు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీఐపీ గ్యాలరీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. తాము టీడీపీ నేతలమని చెప్పినా తమకు ఆదేశాలు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు గేటు […]
తిరుపతిలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పార్టీ ఫిరాయించిన నేతలకు అవమానం జరిగింది. విశాఖ జిల్లాకు చెందిన అరకు వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలను మహానాడు మెయిన్ గేటు వద్దే పోలీసులు ఆపేశారు. వీరు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీఐపీ గ్యాలరీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. తాము టీడీపీ నేతలమని చెప్పినా తమకు ఆదేశాలు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు.
దాదాపు 20 నిమిషాల పాటు గేటు బయటే నిలబెట్టారు. ఈ సమయంలో గండి బాబ్జీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆయన అనుచరులు , ఎమ్మెల్యే సర్వేశ్వరావు అందరూ అవమానభారంతో నిలబడిపోయారు. అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలంతా ఈ సన్నివేశాన్ని విచిత్రంగా చూస్తూ వెళ్లారు. చివరకు తమకు తెలిసిన టీడీపీ నేతలకు ఫోన్ చేసి తమను పోలీసులు లోనికి అనుమతించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొందరు టీడీపీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వారిని లోనికి అనుమతించారు.
Click on Image to Read: