"బూటు కాలితో తంతే ఇప్పటికీ నడుము నొప్పి ఉంది సర్"... మోత్కుపల్లి చాలు ముగించండి!
తిరుపతిలో మహానాడులో టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రసంగం చాలా ఆసక్తిగా సాగింది. గతాన్ని గుర్తుచేసి చంద్రబాబును మొహమాట పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఒక దశలో టీడీపీ కోసం పోరాటం చేసింది తానొక్కడినేనని ఈ విషయం చంద్రబాబు గుర్తించాలని కోరారు. చంద్రబాబు తరపున తాను ఫైట్ చేస్తుంటే తెలుగుభాషలో ఉన్న బూతులన్నీ తనను తిట్టారని గుర్తు చేసుకున్నారు. కొందరు చంపుతామని కూడా బెదిరించారన్నారు. బాబ్లి ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు, తాను, మిగిలిన ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు వెళ్తే […]
తిరుపతిలో మహానాడులో టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రసంగం చాలా ఆసక్తిగా సాగింది. గతాన్ని గుర్తుచేసి చంద్రబాబును మొహమాట పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఒక దశలో టీడీపీ కోసం పోరాటం చేసింది తానొక్కడినేనని ఈ విషయం చంద్రబాబు గుర్తించాలని కోరారు. చంద్రబాబు తరపున తాను ఫైట్ చేస్తుంటే తెలుగుభాషలో ఉన్న బూతులన్నీ తనను తిట్టారని గుర్తు చేసుకున్నారు. కొందరు చంపుతామని కూడా బెదిరించారన్నారు.
బాబ్లి ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు, తాను, మిగిలిన ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు వెళ్తే అక్కడి పోలీసులు కొట్టారని గుర్తు చేసుకున్నారు. అక్కడ పోలీసులు బూటుకాలితో ముడ్డి మీద తంతే ఎగిరిపడ్డామని చెప్పారు. మహా పోలీసులు తన్నిన తన్ను వల్ల ఇప్పటికీ తాను సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పారు. నడుము నొప్పిఅలాగే ఉందని మోత్కుపల్లి ఆవేదన చెందారు. సిద్దిపేట బై ఎలక్షన్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు,పోలీసులు తనను కొట్టారని గుర్తు చేసుకున్నారు. అయినా తాను పార్టీ కోసం చంద్రబాబుకోసం పోరాడుతూనే ఉన్నానని చెప్పారు. ఈ విషయాలన్నీ చంద్రబాబు మనసులో పెట్టుకోవాలని కోరారు. చేతిలో పది రూపాయలు కూడా లేవని…పోరాడి పోరాడి అలసిపోయానన్నారు. చంద్రబాబు ఆశీస్సులు తనకు కావాలన్నారు. పరోక్షంగా ఎదో ఒక విధంగా సాయం చేయాలని చంద్రబాబును కోరారు.
అయితే మోత్కపల్లి ప్రసంగాన్ని చంద్రబాబు లైట్ గా తీసుకున్నట్టుగా అనిపించింది. మోత్కుపల్లి ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ మధ్యలో తాగేందుకు నీళ్లు కావాలంటూ ఆగారు. దీంతో మైక్ అందుకున్న చంద్రబాబు… మోత్కుపల్లి గారు త్వరగా ముగించండి. టైమ్ లేదు. ఇప్పటికే రెండు గంటలు ఆలస్యం అయింది అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మోత్కుపల్లి కూడా వయసు మీద పడింది ఎక్కువ సేపు ఏం మాట్లాడగలను సార్ అంటూ ప్రతిస్పందించారు.
Click on Image to Read: