పులివెందుల రౌడీలు వస్తే రెండు నిమిషాల్లో అలర్ట్ వస్తుంది
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల చేయకూడని వ్యాఖ్యలే పదేపదే చేస్తున్నారు. పాపాలు చేసిన వారే గుడికి వెళ్లి చందాలు వేస్తున్నారు.. అందుకే హుండీల ఆదాయం పెరిగిందంటూ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం తాజాగా మరోసారి పులివెందుల మీద పడ్డారు. తిరుపతి మహానాడులో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతను ఎన్నడూలేని విధంగా కాపాడుతామన్నారు. ఇందుకోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో పగలు రాజకీయాలు చేస్తూ రాత్రి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అలిపిరి వద్ద తనపై దాడి చేసిన […]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల చేయకూడని వ్యాఖ్యలే పదేపదే చేస్తున్నారు. పాపాలు చేసిన వారే గుడికి వెళ్లి చందాలు వేస్తున్నారు.. అందుకే హుండీల ఆదాయం పెరిగిందంటూ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం తాజాగా మరోసారి పులివెందుల మీద పడ్డారు. తిరుపతి మహానాడులో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతను ఎన్నడూలేని విధంగా కాపాడుతామన్నారు. ఇందుకోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ ప్రాంతంలో పగలు రాజకీయాలు చేస్తూ రాత్రి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అలిపిరి వద్ద తనపై దాడి చేసిన వారికి గంగిరెడ్డి సెల్‌ఫోన్లు అందించారన్నారు. తునిలో రైలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిన వైసీపీ నేతలే తగలబెట్టారని ఈ విషయం తాను అప్పుడే చెప్పానన్నారు.పులివెందుల్లో వైఎస్ కుటుంబం వరుసగా గెలుస్తోందంటే ప్రజలు ఓట్లేయడంవల్ల కాదని రౌడీయిజం వల్ల అది సాధ్యమవుతోందన్నారు. తాను మాత్రం కుప్పం నియోజకవర్గానికి ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తానని కానీ ఇక్కడి జనం ఓటేసి గెలిపిస్తున్నారని అది సిసలైన ప్రజావిజయం అని చంద్రబాబు చెప్పుకున్నారు.
నేరాలను అరికట్టేందుకు రాష్ట్రమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రౌడీల ఫొటోలను ప్రదర్శిస్తామన్నారు. ఎవరైనా రౌడీ షీటర్ వస్తే పలానా పులివెందుల రౌడీ వచ్చారని రెండు నిమిషాల్లోనే అలర్ట్ వస్తుందన్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై సదరు రౌడీని పట్టుకుంటారని చెప్పారు. చంద్రబాబు పులివెందులను హేళన చేసి మాట్లాడిన సమయంలో వేదికపైన ఉన్న కడప జిల్లా టీడీపీ నేతలతో సహా అందరూ విరగబడినవ్వారు. పులివెందుల్లో ఒక రౌడీ ఉండి మొత్తం రౌడీయిజాన్ని నడుపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాను నిప్పులా బతికానని… ఎప్పుడూ తప్పు చేయలేదని ఇకముందు కూడా చేయబోనని మరోసారి చెప్పారు. తనపై 25సార్లు కోర్టుకు వెళ్లినా ఏమీ చేయలేకపోయారని అన్నారు. అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ పదేపదే ఒక ప్రాంతాన్ని కించపరచడంపై అనేకవిమర్శలు వచ్చాయి. కానీ చంద్రబాబు మాత్రం రాయలసీమ, కడప, పులివెందులపై వీలు చిక్కినప్పుడల్లా ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా మారింది.
Click on Image to Read: