కేజ్రీవాల్, బీజేపీ ప్రకటనల యుద్ధం
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిన సందర్భంగా జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ రెండేళ్ళ పాలన గురించి ఏకరువు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం రూ. 1,000 కోట్ల ఖర్చుతో ప్రకటనలు విడుదల చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలమీద వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాచేస్తోందని బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ అభిమానులు కేజ్రీవాల్ మీద ఎప్పుడూ దుమ్మెత్తిపోస్తూ వుంటారు. అందుకు ప్రతీకారమా అన్నట్టు ఇపుడు కేజ్రీవాల్ […]
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిన సందర్భంగా జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ రెండేళ్ళ పాలన గురించి ఏకరువు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం రూ. 1,000 కోట్ల ఖర్చుతో ప్రకటనలు విడుదల చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలమీద వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాచేస్తోందని బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ అభిమానులు కేజ్రీవాల్ మీద ఎప్పుడూ దుమ్మెత్తిపోస్తూ వుంటారు. అందుకు ప్రతీకారమా అన్నట్టు ఇపుడు కేజ్రీవాల్ బీజేపీ మీద విరుచుకుపడ్డారు. నేను ఏడాదికి రూ. 150 కోట్లు యాడ్స్ మీద ఖర్చుచేస్తే విమర్శించిన బీజేపీ ఒక్కరోజు జరుపుకునే వార్షికోత్సవానికి రూ. 1,000 కోట్లు ఎలా ఖర్చుచేస్తోందని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో యాడ్స్ విషయంలో కేజ్రీవాల్ మీద విరుచుకుపడింది. ఏడాదికి 100 కోట్లకు పైగా యాడ్స్‌మీద ఖర్చుపెట్టారని కాంగ్రెస్‌నాయకుడు అజయ్ మకేన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టులో ప్రభుత్వం వివరణ ఇస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, స్కూల్ ఫీజులు తగ్గించామని, నీళ్ళు ఉచితంగా ఇచ్చామని ఇవన్నీ ప్రజలకు తెలియడంకోసం యాడ్స్ ఇవ్వాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు మినిస్టర్ గోపాల్‌రాయ్ మరో అడుగు ముందుకువేసి ఆడ్-ఈవన్ నెంబర్ల స్కీమ్ ప్రజలకు అర్ధంకావడానికి యాడ్స్‌మీద ఇంకా ఎక్కువ ఖర్చుపెడతామని వివరణ ఇచ్చాడు.