Telugu Global
NEWS

డీఎస్‌కు టికెట్ ఎందుకిచ్చారంటే..!

టీఆర్ ఎస్ నుంచి రాజ్య‌స‌భ టికెట్లు ఖ‌రార‌య్యాయి. పెద్ద‌ల స‌భ‌కు ఇద్ద‌రిని పంపే బ‌లం గులాబీ పార్టీకి ఉంది. ఇందులో మొద‌టిది కెప్టెన్ లక్ష్మీకాంత‌రావుకు వెళ్ల‌గా.. మ‌రోటి కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ గూటికి చేరిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్‌)ను వ‌రించింది. ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన డీఎస్‌కు ఇంత ప్రాధాన్యం ఎందుకు? అన్న అనుమానం చాలామందిలో వ‌చ్చే ఉంటుంది. అస‌లు విష‌యం ఏంటంటే.. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చి.. కారెక్క‌డంలో సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ […]

డీఎస్‌కు టికెట్ ఎందుకిచ్చారంటే..!
X
టీఆర్ ఎస్ నుంచి రాజ్య‌స‌భ టికెట్లు ఖ‌రార‌య్యాయి. పెద్ద‌ల స‌భ‌కు ఇద్ద‌రిని పంపే బ‌లం గులాబీ పార్టీకి ఉంది. ఇందులో మొద‌టిది కెప్టెన్ లక్ష్మీకాంత‌రావుకు వెళ్ల‌గా.. మ‌రోటి కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ గూటికి చేరిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్‌)ను వ‌రించింది. ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన డీఎస్‌కు ఇంత ప్రాధాన్యం ఎందుకు? అన్న అనుమానం చాలామందిలో వ‌చ్చే ఉంటుంది. అస‌లు విష‌యం ఏంటంటే.. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చి.. కారెక్క‌డంలో సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ క‌విత కీల‌క పాత్ర పోషించారు. ఎలాగంటే.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్‌లో కారు జోరుకు మ‌రే పార్టీ నిల‌వ‌లేక‌పోయింది. జిల్లాలో ఉన్న ఎంపీతోపాటు 10 అసెంబ్లీ స్థానాల‌ను కారుపార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయినా డీఎస్ పార్టీలో ఉన్నంత కాలం కారు పార్టీకి ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే. అందుకే ఆయ‌న్ని లాగేయాల‌నుకుంది. ఈ బాధ్య‌త స్వ‌యంగా క‌వితే తీసుకున్నార‌ని స‌మాచారం. డీఎస్ కు రాజ్య‌స‌భ సీటు ఇప్పిస్తాన‌న్న హామీతోనే ఆయ‌న పార్టీలోకి వ‌చ్చార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. అందుకే డీఎస్ పార్టీలోకి రాగానే కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. దీనిపై ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెట్టినా.. కేసీఆర్ ప‌ట్టించుకోలేదు.
కాంగ్రెస్‌ను బ‌ల‌హీనం చేసేందుకే..!
కాంగ్రెస్‌లో ఉన్న పెద్ద నాయ‌కుల్లో డీఎస్ మొద‌టివ‌రుస‌లో ఉండేవాడు. పైగా పార్టీలో బీసీలంద‌రికీ పెద్ద‌దిక్కుగా ఉన్నాడు. ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం కాంగ్రెస్ పార్టీలో ఇప్ప‌టికీ ప‌లు కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నారు. ముందు డీఎస్‌ను లాగితే.. ఆయ‌నే వారంద‌రినీ తీసుకొస్తార‌న్న‌ది కేసీఆర్ వ్యూహం అని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీనం చేయాల‌న్న ప‌థ‌కంలో భాగంగానే డీఎస్‌కు రాజ్య‌స‌భ టికెట్ కేటాయించార‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డీఎస్ కారెక్క‌గానే ఎలాంటి ప‌ద‌వుల్లోలేని బీసీ నేత‌లు కొంద‌రు కారెక్కారు. మ‌రికొంద‌రు కారెక్కుదామ‌న్న ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టికీ చేస్తున్నారు. డీఎస్‌తో మంచి సంబంధాలున్న‌బీసీ నేత వ‌కుళాభ‌ర‌ణం ఇప్ప‌టికే కారెక్కారు. ఒక‌ప్పుడు డీఎస్‌తో మంచి సంబంధాలున్న దానం నాగేంద‌ర్ సైతం గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కారెక్క‌డానికి ప్ర‌య‌త్నించారు. వెనువెంట‌నే.. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల సైతం గులాబీ కండువా క‌ప్పుకుంటారన్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దీన్ని పొన్నాల ఖండించారు. ఇదంతా డీఎస్ కార‌ణంగానే జ‌రుగుతోంద‌ని, తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌కు ఎప్ప‌టికైనా ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్న విష‌యం తెలిసే…ఇదంతా చేస్తున్నాడ‌ని కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌పై మండిప‌డుతున్నారు.

Click on Image to Read:

chandrababu-naidu

tdp-leaders

Bojjala-Gopala

eenadu amaravathi artical

ysrcp-mla's

pati-pati-pullarao-acham-na

venkaiah

jalil-khan

vijayasai-reddy

chintamaneni-prabhakar1

trs

vijayasai-reddy-YS-Jagan

Kidnap

Defection-Act-1

chandrababu-park-hyatt-hote

rajareddy

First Published:  27 May 2016 6:03 AM IST
Next Story