Telugu Global
Cinema & Entertainment

12 రోజుల్లో రూ.8 కోట్లు ఖర్చు పెట్టేశారు...

రజనీకాంత్ సినిమాలో ఓ పందెం ఉంటుంది. నెల రోజుల్లో ఎన్నో కోట్లు ఖర్చుచేయాలనేది ఆ పందెం. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకు అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నట్టున్నారు. రోజుకు దాదాపు కోటిన్నర పైగా ఖర్చుచేస్తున్నారు. కేవలం సింగిల్ షెడ్యూల్ కే ఇప్పటివరకు 12 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇదంతా బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన మేటర్. తన వందో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా ఈ మధ్యే […]

12 రోజుల్లో రూ.8 కోట్లు ఖర్చు పెట్టేశారు...
X

రజనీకాంత్ సినిమాలో ఓ పందెం ఉంటుంది. నెల రోజుల్లో ఎన్నో కోట్లు ఖర్చుచేయాలనేది ఆ పందెం. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకు అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నట్టున్నారు. రోజుకు దాదాపు కోటిన్నర పైగా ఖర్చుచేస్తున్నారు. కేవలం సింగిల్ షెడ్యూల్ కే ఇప్పటివరకు 12 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇదంతా బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన మేటర్. తన వందో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా ఈ మధ్యే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. మొరాకో లో భారీ స్థాయిలో ఈ షెడ్యూల్ జరిగింది. వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు, 200 గుర్రాలు, ఒంటెలు… ఇలా భారీగా యుద్ధసన్నివేశాల్ని తెరకెక్కించారు. కేవలం ఈ 12 రోజుల షెడ్యూల్ కోసమే నిర్మాతలు దాదాపు 8కోట్ల రూపాయలు ఖర్చుచేశారట. బాలయ్యకు ప్రతిష్టాత్మక సినిమా కావడం వల్ల ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గకూడదని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. మరీ ముఖ్యంగా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కూడా ఒక నిర్మాత కావడంతో… ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం భారీ ఖర్చుతో ఓ సెట్ ను తీర్చిదిద్దుతున్నారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Click on Image to Read:

brahmotsavam

pawan

janatha-garage-movie

A-AA-Censor-Report

First Published:  26 May 2016 4:31 AM IST
Next Story