చినబాబు తెలంగాణ నేతలను వెళ్లిపొమ్మన్నాడా?
టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు తాను తెలివైనవాడు అనుకుంటాడో..లేక తను తలచిందే నిజమనుకుంటాడో గానీ.. ఆయన మాటలు పలుమార్లు తన రాజకీయ అపరికపక్వతకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే! తాజాగా తెలంగాణపై ఆయన మరోసారి విషం గక్కాడు. గతంలో ఆయన తెలంగాణ పేపర్లు, టీవీ చానళ్లపై ట్విట్లర్లో కూతలు పెట్టేవాడు. ఈసారి సొంతపార్టీ నేతలపైనే విరుచుకుపడ్డాడు. తాజాగా తెలంగాణ టీడీపీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చేది […]
BY admin26 May 2016 4:45 AM IST
X
admin Updated On: 27 May 2016 5:53 AM IST
టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు తాను తెలివైనవాడు అనుకుంటాడో..లేక తను తలచిందే నిజమనుకుంటాడో గానీ.. ఆయన మాటలు పలుమార్లు తన రాజకీయ అపరికపక్వతకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే! తాజాగా తెలంగాణపై ఆయన మరోసారి విషం గక్కాడు. గతంలో ఆయన తెలంగాణ పేపర్లు, టీవీ చానళ్లపై ట్విట్లర్లో కూతలు పెట్టేవాడు. ఈసారి సొంతపార్టీ నేతలపైనే విరుచుకుపడ్డాడు. తాజాగా తెలంగాణ టీడీపీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చేది లేదని ఎన్టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశాడు. చినబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశంలోని సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణలో పార్టీకి ఈ దుస్థితి తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. అస్సలు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోకుంటే.. పార్టీకి తెలంగాణలో ఈ దుస్థితి వచ్చి ఉండేదే కాదని తెలిసిన వారి వద్ద వాపోతున్నారు. 2004లో ఘోర పరాజయం తరువాత తెలంగాణ టీడీపీ నేతలు ఇంతవరకు అధికారాన్ని చవి చూసింది లేదు. అయినా, 12 ఏళ్లుగా పార్టీని అంటి పెట్టుకుట్టుని ఉండటమే మేం చేసిన నేరమా? అని ఆవేదన చెందుతున్నారు. పదవులు ఇవ్వంగానీ, పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి అని పరోక్షంగా చెప్పాడా? అంటూ చినబాబు వ్యాఖ్యల్ని తలచుకుని కుమిలిపోతున్నారు.
అంతా మీరే చేసి..!
ఓటుకు నోటు కేసులో రేవంత్, చంద్రబాబు ఇరుక్కోవడంతో ఇక్కడ పార్టీ దాదాపుగా నాశనమైంది. గులాబీ ఆకర్ష్‌కి ఒకరిద్దరు మినహా అందరూ కారెక్కారు. చేసిందంతా మీరే చేసి.. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వమంటూ చెప్పడానికి మీరెవరు? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం పార్టీ అధినేత కొడుకు అన్న అర్హత తప్ప..లోకేశ్ పార్టీకి చేసిందేముందని అనుకుంటున్నారు. ఏనాడైనా పార్టీ జెండా మోశాడా? కనీసం వేదికపై తప్పులు లేకుండా ప్రసంగించగలడా? ఇలాంటి వ్యక్తికి ఏకంగా జాతీయ కార్యదర్శి హోదాలో కూర్చోబెడితే.. ఇలాంటి మాటలే మాట్లాడుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి పార్టీని ఇరుకున బెట్టి, అమరావతి పోయాడు. ఇక కొడుకు తెలంగాణ నాయకులు ఉంటే ఉండండి.. లేదంటే పోతే పొండి అని పరోక్షంగా చెప్పాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story