ఏపీ సీపీఎం కార్యదర్శి మధు కుటుంబసభ్యుడి దారుణ హత్య
సీపీఎం ఏపీ కార్యదర్శి మధు మేనల్లుడు హష్మి దారుణహత్యకు గురయ్యారు. హైదరాబాద్ లింగంపల్లిలోని రైల్వే ట్రాక్ దగ్గర హష్మి మృతదేహం బయటపడింది. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి వచ్చిన పోలీసులు మృతుడిని మధు మేనల్లుడిగా గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి గత వారమే టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరాడు. హష్మికి చెందిన సెల్‌ఫోన్, నగదు, బంగారుగొలుసు కోసమే అతడి స్నేహితుడు నరేష్ కుమార్ హత్యచేసినట్టుగా భావిస్తున్నారు. […]
సీపీఎం ఏపీ కార్యదర్శి మధు మేనల్లుడు హష్మి దారుణహత్యకు గురయ్యారు. హైదరాబాద్ లింగంపల్లిలోని రైల్వే ట్రాక్ దగ్గర హష్మి మృతదేహం బయటపడింది. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి వచ్చిన పోలీసులు మృతుడిని మధు మేనల్లుడిగా గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి గత వారమే టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరాడు. హష్మికి చెందిన సెల్‌ఫోన్, నగదు, బంగారుగొలుసు కోసమే అతడి స్నేహితుడు నరేష్ కుమార్ హత్యచేసినట్టుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం బల్కంపేటలో నివాసం ఉండే వల్లిపల్లి హష్మి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే ఇంటికి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హష్మి కాల్ డేటా ఆధారంగా నరేష్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.
తన రూమ్ పక్కనే ఉండే నరేష్‌కుమార్ తో కలిసి హష్మి లింగంపల్లి వెళ్లాడు.అక్కడికివెళ్లాక తనకు ఓ పది వేల రూపాయలు కావాలని నరేష్ అడిగాడు. అయితే తన తగ్గర డబ్బులు లేవని హష్మి చెప్పాడు. దీంతో బలవంతంగా డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో బండరాయితో హష్మిని కొట్టిచంపినట్టు నరేష్ కుమార్ ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత హష్మి దగ్గర ఉన్న పర్సు, సెల్‌ఫోన్, బంగారుగొలుసు తీసుకుని నరేష్ వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఏమీ తెలియనట్టుగానే హష్మి ఇంటికి వచ్చాడు నరేష్. హష్మి ఎక్కడికివెళ్లాడో తెలియదని బైక్ ఇవ్వడానికి వచ్చానని నమ్మించాడు. కానీ కాల్ డేటా ఆధారంగా నరేష్ కుమార్ చేసిన దారుణం బయటపడింది.
Click on Image to Read: