జనంలో గెలవలేడు గానీ... మాపై స్వారీనా? గో బ్యాక్ వెంకయ్యా!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు వ్యతిరేకంగా కర్నాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యకు పదేపదే కర్నాటక నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు వెంకయ్యకు వ్యతిరేకంగా మంగళవారం రోడ్డెక్కాయి. మరోసారి వెంకయ్యను కర్నాటక కోటాలోనే రాజ్యసభకు పంపాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో బెంగళూరు, చిక్కబళ్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వెంకయ్య దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇప్పటికే మూడు సార్లు కర్నాటక కోటాలో వెంకయ్య నామినేట్ అయ్యారని కానీ ఏనాడైనా రాష్ట్ర […]
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు వ్యతిరేకంగా కర్నాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యకు పదేపదే కర్నాటక నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు వెంకయ్యకు వ్యతిరేకంగా మంగళవారం రోడ్డెక్కాయి. మరోసారి వెంకయ్యను కర్నాటక కోటాలోనే రాజ్యసభకు పంపాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో బెంగళూరు, చిక్కబళ్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వెంకయ్య దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఇప్పటికే మూడు సార్లు కర్నాటక కోటాలో వెంకయ్య నామినేట్ అయ్యారని కానీ ఏనాడైనా రాష్ట్ర సమస్యలపై స్పందించారా అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతంపై ఈ ఆధిపత్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్యను కర్నాటక నుంచి రాజ్యసభకు పంపితే రాబోయే కాలంలో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కర్నాటకలో రాజ్యసభకు వెళ్లే స్థాయి ఉన్న నేతలే లేరా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
వెంకయ్య తన అవకాశాలకు పదేపదే గండి కొట్టడంపై కర్నాటక బీజేపీ నేతలు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. కానీ పార్టీని ధిక్కరించలేక మౌనంగా ఉంటున్నారు. సోషల్‌మీడియాలోనూ వెంకయ్యకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో క్యాంపయిన్ నడుస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు బీజేపీ, వెంకయ్యపై నిప్పులు చెరుగుతున్నారు. గో బ్యాక్ వెంకయ్య అంటూ పోస్టులు పెడుతున్నారు. జనం నుంచి నేరుగా గెలవడం చేతగాని వ్యక్తిని అసలు కేంద్ర కేబినెట్‌లో ఉంచుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తూ విరుచుకుపడుతున్నారు.
Click on Image to Read: