ఇక దేవాలయాల్లో "భజన"లో ట్రైనింగ్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ రాష్ట్రంలోని 59 ప్రధాన దేవాలయాల్లో భక్తులకు భజనలో శిక్షణ ఇచ్చేందుకు గానూ శిక్షకులను నియమించనుంది. వీళ్లకు నెలకు 15,000ల రూపాయలు చెల్లిస్తారు. ఈ దేవాలయ కేంద్రాలలో భజనలోనూ, పారాయణంలోనూ, కోలాటంలోనూ, యోగా వంటి అంశాలలో శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా భజనలో శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో జిల్లాకు 5 నుంచి 8 మంది భజన మాస్టర్లను నియమించనున్నారు. రెండేళ్ళపాటు వీళ్లు ఆ ఉద్యోగాల్లో కొనసాగుతారని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ తెలియజేశారు.