వైఎస్ మరణంపై కథనం కేసు " సాక్షి టార్గెట్ అయిందా?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ హస్తముందంటూ అప్పట్లో వచ్చిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఈ కథనాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ దుకాణాలపై వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. దీనిపై అప్పట్లో టీవీ5, ఎన్‌టీవీ, సాక్షి ఛానళ్లపై కేసులు నమోదయ్యాయి. నిరాధార కథనాలు ప్రసారం చేశారంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఛానళ్లపై దేశద్రోహం కేసు పెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఈకేసును తెలంగాణ సీఐడీ విచారిస్తోంది. […]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ హస్తముందంటూ అప్పట్లో వచ్చిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఈ కథనాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ దుకాణాలపై వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. దీనిపై అప్పట్లో టీవీ5, ఎన్‌టీవీ, సాక్షి ఛానళ్లపై కేసులు నమోదయ్యాయి. నిరాధార కథనాలు ప్రసారం చేశారంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఛానళ్లపై దేశద్రోహం కేసు పెట్టింది.
రాష్ట్ర విభజన తర్వాత ఈకేసును తెలంగాణ సీఐడీ విచారిస్తోంది. ఇప్పుడు టీవీ 5, ఎన్‌టీవీలను తప్పించి కేవలం సాక్షి ఛానల్ మీద మాత్రమే కేసు నడిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ హస్తముందని సాక్షి ఛానల్ తొలుత ప్రసారం చేసిందని… దాన్ని తాము కూడా గుడ్డిగా నమ్మి కథనాలు ప్రసారం చేశామని క్షమించి కేసు ఎత్తివేయాలంటూ టీవీ5, ఎన్‌టీవీలు తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. రెండు ఛానళ్ల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన టీ సర్కార్ వాటికి విముక్తి కల్పించాలని నిర్ణయించిందని కథనాలు వచ్చాయి. . అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే అప్పట్లో వైఎస్ మరణం వెనుక రిలయన్స్ హస్తముందంటూ తొలుత కథనాలు ప్రసారం చేసింది సాక్షి కాదని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ విముక్తి కలిగించేందుకు రెడీ అయిన రెండు ఛానళ్లలో ఒకటి తొలుత కథనం ప్రసారం చేసిందని చెబుతున్నారు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ పెద్దల హస్తముందంటూ రష్యాకు చెందిన ఒక వెబ్‌సైట్ వెల్లడించిందంటూ తొలుత కథనాలు ప్రసారం చేశారు.
మరోవైపు తమను కూడా దేశద్రోహం కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని సాక్షి మీడియా కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ ఇందుకు తెలంగాణ సీఐడీ అంగీకరించలేదు. దేశద్రోహం కేసును తొలగించడం సాధ్యం కాదని కేసీఆర్‌కు సీఐడీ లేఖలో స్పష్టం చేసింది. అయినా రెండు ఛానళ్లను కేసు నుంచి తొలగించడం సాధ్యమైనప్పుడు మూడో చానల్ విషయంలో మాత్రం ఆ వెసులుబాటు ఎందుకు లేదో!.
Click on Image to Read: