Telugu Global
Others

కొత్త జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ వ్యూహం అదేనా?

ప‌రిపాల‌న వికేంద్రీక‌రించ‌డం, వెన‌క‌బ‌డిన ప్రాంతాల‌కు అభివృద్ధిని చేరువ చేయ‌డం, ఉపాధి అవ‌కాశాల‌ను పెంచ‌డం.. ఈ అంశాలే ల‌క్ష్యంగా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. నిజంగా కేసీఆర్ ఆలోచ‌న ఇదేనా..?  లేదా ఇందులో మ‌రేదైనా రాజ‌కీయ ల‌బ్ధి దాగుందా?  రాజ‌కీయ మేథావుల‌ను,  ప‌్ర‌తిప‌క్ష పార్టీ నేతల‌ను వేధిస్తోన్న‌ ప్ర‌శ్న ఇది. కొత్త జిల్లాల ఏర్పాటు వెన‌క కేవ‌లం వెన‌క‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి నినాదం ఒక్క‌టే కాద‌ని వారు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. కారు […]

కొత్త జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ వ్యూహం అదేనా?
X
ప‌రిపాల‌న వికేంద్రీక‌రించ‌డం, వెన‌క‌బ‌డిన ప్రాంతాల‌కు అభివృద్ధిని చేరువ చేయ‌డం, ఉపాధి అవ‌కాశాల‌ను పెంచ‌డం.. ఈ అంశాలే ల‌క్ష్యంగా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. నిజంగా కేసీఆర్ ఆలోచ‌న ఇదేనా..? లేదా ఇందులో మ‌రేదైనా రాజ‌కీయ ల‌బ్ధి దాగుందా? రాజ‌కీయ మేథావుల‌ను, ప‌్ర‌తిప‌క్ష పార్టీ నేతల‌ను వేధిస్తోన్న‌ ప్ర‌శ్న ఇది. కొత్త జిల్లాల ఏర్పాటు వెన‌క కేవ‌లం వెన‌క‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి నినాదం ఒక్క‌టే కాద‌ని వారు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. కారు పార్టీ ఓటు బ్యాంకును ప‌దిల‌ప‌రుచుకునే క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల విభజ‌న జ‌రుగుతుందేమోన‌న్న ఆందోళ‌న రాజ‌కీయ నాయ‌కుల్లో నెల‌కొంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌లో ఇది కూడా ఒక భాగ‌మైతే.. ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల ఓటుబ్యాంకుల‌కు గండి ప‌డ‌టం ఖాయం. అదే స‌మ‌యంలో సొంత‌పార్టీ ఓట్ల‌కు చిల్లు ప‌డే ప్ర‌మాదం లేక‌పోలేదు. రాజుత‌ల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? అన్న‌ట్లుగా.. అధికార పార్టీ త‌ల‌చుకుంటే కొత్త జిల్లాల ఏర్పాటు పెద్ద విష‌య‌మేం కాదు. అందుకే, ఇందుకు వ్య‌తిరేకంగా సాక్షాత్తూ ప్ర‌జ‌లే గ‌ళ‌మెత్తినా కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదు.
అలా జ‌రిగితే ఏమ‌వుతుంది?
2009లో ఉమ్మ‌డి ఏపీలో కొత్త నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. అంటే అంత‌క‌ముందున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగింది. దీంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌మ ఓటు బ్యాంకు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ల‌డంతో వారు కూడా వ‌ల‌స వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలా వ‌ల‌స వెళ్లిన వారిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువ‌శాతం విజ‌యం సాధించారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వ‌ల్ల ఓటు బ్యాంకు త‌ప్ప‌కుండా ప్ర‌భావితం అమ‌వుతుంది. పాతికేళ్ల‌కు పైగా వివిధ నియోజ‌క‌వర్గాల్లో తిష్ట‌వేసుకుని కూర్చున్న ఎమ్మెల్యేల‌ను సైతం ఈ అంశం వారిని కుర్చీ నుంచి దింపేసింది. అదే స‌మ‌యంలో అధికార పార్టీ నేత‌ల్లోనూ ఇది ఆందోళ‌న‌ను పెంచుతోంది. ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చి చేరిన ఎమ్మెల్యేలు ఉన్న నేత‌ల్లో ఈ ఆందోళ‌న మ‌రీ అధికంగా ఉంది. నిజంగానే కొత్త జిల్లాలు ఏర్ప‌డి 2019లో ఎన్నిక‌లు వ‌స్తే.. త‌ప్ప‌కుండా ఇది త‌మ‌కు శాపంగా మారుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. అయితే, అధికార‌పార్టీ కావ‌డం, సంక్షేమ ప‌థ‌కాలు మాత్ర‌మే గెలిపిస్తాయ‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొన్ని జిల్లాల ఏర్పాటు వ‌ల్ల ఇప్పుడు జిల్లా కేంద్రాల‌కు స‌మీపంలో ఉన్న వివిధ నియోజ‌క‌వ‌ర్గాలు కొత్త జిల్లాల‌కు 70 -80 కిమీల దూరంలోకి వెళుతున్నాయి. ఈ అంశంలో ప్ర‌జ‌ల‌కు తిక్క‌రేగితే.. ఎన్నిక‌ల్లో బండ‌కేసి కొట్ట‌డం ఖాయం. కొత్త జిల్లాల ఏర్పాటు వెన‌క రాజ‌కీయ కోణం ఉంటే.. ఆ ప్ర‌మాదం గులాబీ పార్టీకి సైతం పొంచి ఉంది.
First Published:  23 May 2016 11:54 PM GMT
Next Story