బెజవాడ టీడీపీలో ముసలం... లోతుగా గోతులు తవ్వుకుంటున్న తమ్ముళ్లు
విజయవాడ నగర టీడీపీలో తమ్ముళ్లు అంతర్గత కుమ్ములాటలకు దిగుతున్నారు. మేయర్ కోనేరు శ్రీధర్‌ను పదవి నుంచి దించేందుకు టీడీపీలోని ఒక వర్గం పావులు కదుపుతోంది. మేయర్ తమ మాట వినడం లేదంటూ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తెర వెనుక ఉండి తతంగం నడుపుతున్నారు. ఇప్పటికే 12 మంది టీడీపీ కార్పొరేటర్ల నుంచి సంతకాలు సేకరించినట్టు చెబుతున్నారు. కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి మరీ ఒప్పించి సంతకాల సేకరణ జరుపుతున్నారు. మేజారిటీ కార్పొరేటర్ల సంతకాలు స్వీకరించిన తర్వాత సీఎంను కలవాలన్నది టీడీపీ […]
విజయవాడ నగర టీడీపీలో తమ్ముళ్లు అంతర్గత కుమ్ములాటలకు దిగుతున్నారు. మేయర్ కోనేరు శ్రీధర్‌ను పదవి నుంచి దించేందుకు టీడీపీలోని ఒక వర్గం పావులు కదుపుతోంది. మేయర్ తమ మాట వినడం లేదంటూ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తెర వెనుక ఉండి తతంగం నడుపుతున్నారు. ఇప్పటికే 12 మంది టీడీపీ కార్పొరేటర్ల నుంచి సంతకాలు సేకరించినట్టు చెబుతున్నారు. కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి మరీ ఒప్పించి సంతకాల సేకరణ జరుపుతున్నారు. మేజారిటీ కార్పొరేటర్ల సంతకాలు స్వీకరించిన తర్వాత సీఎంను కలవాలన్నది టీడీపీ నేతల భావన. విజయవాడ తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలు మేయర్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల నగరంలో జరిగే కార్యక్రమాలకు మేయర్‌కు కనీసం ఆహ్వానం కూడా పంపడం లేదు.
మేయర్ శ్రీధర్ పట్ల సీఎంకు మాత్రం మంచి అభిప్రాయమే ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ కార్పొరేటర్లు ఎదురుతిరిగేలా చేస్తే శ్రీధర్ పదవి ఊడబీకడం పెద్ద కష్టమేమీ కాదన్న భావనతో వైరి వర్గం పనిచేస్తోంది. ఇటీవల జరిగిన కార్పొరేటర్ల విహారయాత్రలో శ్రీధర్ వ్యతిరేక వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరిపినట్టు చెబుతున్నారు. కోనేరు శ్రీధర్ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని… ఆయన్ను దించివేస్తే అందరికీ లాభం ఉంటుందన్న కోణంతో కార్పొరేటర్లను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు… ఒక సీనియర్ కార్పొరేటర్‌కు సంతకాల సేకరణ బాధ్యత అప్పగించారట. సొంత పార్టీ వారే గోతులు తవ్వుతుండడంతో మేయర్ వర్గం ఆందోళన చెందుతోంది. మేజారిటీ కార్పొరేటర్లు తిరగబడితే ఏం చేయాలన్న దానిపై మథనపడుతున్నారు. అయితే తన పదవిని సీఎం చంద్రబాబే రక్షిస్తారన్న ఆశతో మేయర్ ఉన్నారు.
Click on Image to Read: