ఆదినారాయణరెడ్డికి అవమానమా?
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టుగా ఫిరాయింపుదారుల పరిస్థితి తయారైందన్న భావన వ్యక్తమవుతోంది. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిది ఇదే పరిస్థితి అని చెబుతున్నారు. పార్టీలో చేరిన తొలి రోజుల్లో ఆదికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ సొంతూరు బలపనూరులో జరగనున్న సర్పంచ్ బై ఎలక్షన్‌లో టీడీపీని గెలిపించి తన సత్తా చూపిస్తా అంటూ ఆదిచెప్పుకునే వారు. నియోజకవర్గాన్ని ఓ రేంజ్‌లో అభివృద్ధి చేస్తానంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆదికి […]
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టుగా ఫిరాయింపుదారుల పరిస్థితి తయారైందన్న భావన వ్యక్తమవుతోంది. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిది ఇదే పరిస్థితి అని చెబుతున్నారు. పార్టీలో చేరిన తొలి రోజుల్లో ఆదికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ సొంతూరు బలపనూరులో జరగనున్న సర్పంచ్ బై ఎలక్షన్‌లో టీడీపీని గెలిపించి తన సత్తా చూపిస్తా అంటూ ఆదిచెప్పుకునే వారు. నియోజకవర్గాన్ని ఓ రేంజ్‌లో అభివృద్ధి చేస్తానంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆదికి ఇటీవల షాక్ ఇచ్చారట. అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను తీసుకుని సీఎం వద్దకు వెళ్లాలనుకున్నారు. అపాయింట్‌మెంట్ క్షణాల్లో వచ్చేస్తుందనుకున్నారట. కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు అవమానించారు. ఈ పరిస్థితి చూసి ఆది షాక్ అయ్యారట. నాకు అపాయింట్మెంట్ రాకపోవడమా అని మథనపడ్డారని చెబుతున్నారు. కానీ బయటకు చొప్పుకుంటే పరువుపోతుందన్న ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నారని చెబుతున్నారు. ఇదే అంశంపై ఒక ప్రముఖ పత్రిక కథనాన్నిప్రచురించింది. కొందరు మధ్యవర్తుల ద్వారా కూడా అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నించినా ఫలితంలేదంటున్నారు. ఆదినారాయణరెడ్డికి జరిగిన అవమానం చూసి ఆయన ప్రత్యర్థులు సంబరపడుతున్నారు.
Click on Image to Read: