బాబు హోటల్ కాపురంపై నెటిజన్ల దండయాత్ర... పంచ్‌ల్లో మచ్చుకు కొన్ని
ఏపీ ఆర్థికలోటులో ఉందని తలో చేయి వేసి రాష్ట్రాన్ని నిలబెట్టాలని పదేపదే చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఖరీదైన పార్క్ హయత్ హోటల్‌లో కాపురం పెట్టడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. చెప్పేది శ్రీరంగనీతులు దూరేది పార్క్ హయత్‌లోకా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. వాటిలో మచ్చుకు కొన్ని…( అసభ్యకరమైన పదాలను తొలగించడం అయినది) 1. ఎక్కడ మొదలు పెట్టాడో ? మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. సూటుకేసులతో కోట్లు పెట్టి MLAలను కొని […]
ఏపీ ఆర్థికలోటులో ఉందని తలో చేయి వేసి రాష్ట్రాన్ని నిలబెట్టాలని పదేపదే చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఖరీదైన పార్క్ హయత్ హోటల్‌లో కాపురం పెట్టడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. చెప్పేది శ్రీరంగనీతులు దూరేది పార్క్ హయత్‌లోకా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
వాటిలో మచ్చుకు కొన్ని…( అసభ్యకరమైన పదాలను తొలగించడం అయినది)
1. ఎక్కడ మొదలు పెట్టాడో ? మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. సూటుకేసులతో కోట్లు పెట్టి MLAలను కొని వైశ్రాయ్ హోటల్ లో పడుకోబెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, నేడు అలాంటి నక్షత్రాల హోటల్ లోకి మకాం మార్చేశాడు.
2. హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సిందేనంటూ చిరు ఉద్యోగుల వెంట పడుతున్నారు కదా… ముందు మీ భార్యను విజయవాడకు తెచ్చుకుంటే కొన్ని కోట్ల ప్రజాధనం మిగులుతుందని కదా బాబు గారు. ఉద్యోగుల కుటుంబాలకో నీతి, మీ కుటుంబానికో నీతా?
3. ఇంతకీ ఈ హోటల్ వాళ్ళు వాస్తు ప్రకారం సరిగ్గా కట్టారో లేదో , సరిగ్గా కట్టకపోతే ఇంకా కొత్త కొత్త విషయాలు బైటకి వస్తాయేమో , ఎందుకు అయిన మంచిది మీ పనికిమాలిన వాస్తు సిద్ధాంతి కి ఒక సారి చూపించి వెళ్ళితే బాగుండేది
4. మదీనా గూడా లో ఫార్మ్ హౌస్ కి కోట్ల ప్రజల సొమ్ముతో రిపేర్ లు చేయించిన cm చంద్రబాబు , పిల్లి పిల్లలని తిప్పినట్టు ఇప్పుడు హోటల్ కి మారారు. Park Hyatt star hotel లో ఉంటారు ఆట. పేద ఆంధ్రప్రదేశ్ ఇంతటి ఆడంబరాల cm ని ఇంకా రెండేళ్ళు భరించి ఏ స్థితికి వెళుతుందో!.
5. అయ్యో హైదరాబాద్‌ను కట్టిన బాబుకు సొంత ఇల్లు లేదా!.. నగరాన్ని కట్టే ఆలోచనలో సొంతిల్లు కట్టుకోవడం మరిచిపోయాడా?.
6. అమరావతిని టోక్కో లెక్క చేయ్యాలంటే కలలు గనాలె. గామాత్రం కాస్ట్‌లీ ఉన్న హోటల్లో ఐయితేనే మంచి మంచి కలలు అత్తయ్ మరి!.
7. హోటల్‌లో మొదలైన రాజకీయం హోటల్‌తోనే ముగుస్తుందేమో చూడాలి.
8. సొంతిల్లు లేని సీఎం కోసం హుండీలు పెట్టలేదా?… బాబు గారి భజనా మీడియా చందాల కోసం ఇంకా పిలుపునివ్వలేదా?.
9. పార్క్ హయాత్ లో ఉందామన్న సలహా చిన్నోడిదట. పార్క్ హయాత్ లోఅయితే స్విమింగ్ పూల్, అన్ని రకాల సపర్యలు అందుబాటులో ఉంటాయి. అదే ఇంటి దగ్గరైతే ఇవ్వన్ని ఉండవుగా!. మీరు మరీను, అర్ధం చేసుకోరూ!.
10. యాపారం కోసరమో.. వాస్తు కోసరమో! .
11. వాస్తు పిచ్చి తో …రేపు కొడుకుకు ముఖ్మమంత్రి అయ్యే కళ లేదు అంటే … ముఖాన్ని కూడా మార్చేస్తారా!
12. అంటే అయన(సుబ్బరామిరెడ్డి) నాగార్జున సాగర్ కట్టిండు, ఇంకా మంచిగా ఉన్నది కదా!. ఆట్లనే హయత్ హోటల్ కూడా ఉంటుందనుకుని సాగుతున్నడెమో!.
13. ఇప్పటికే వంద కోట్లు ఖర్చుపెట్టి ఖర్చు పెట్టి విజయవాడ, హైదరాబాద్లో క్యాంపు ఆపీసులు, నివాసాలు ఏర్పాటు చేసుకుని కూడా ఇలా హోటల్ ల్లో కాపురం పెట్టడం ఏంటి సీఎం గారు.
14. పిల్లి కూడా తన పిల్లలను ఇలాగే ఒకచోటి నుంచి మరొక చోటికి పదేపదే మారుస్తుంది.
15. రెండేళ్లలో సొంతిల్లు కూడా కట్టుకోలేని మీరు అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని కడుతారా?. మేం నమ్మాలా?. త్రీడీలో కామెడీ అంటే ఇదే.
Click on Image to Read: