Telugu Global
Cinema & Entertainment

వయసెక్కువ హీరోలపై ఫీదా అవుతున్న రాధికా ఆప్టే

‘లెజెండ్ ‘ మరియు ‘రక్త చరిత్ర ‘సినిమాల‌ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. హిందీలో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు ఒకదాని వెంట మరొకటె చేస్తు మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా (కబాలి)లో ఆయన పక్కన హీరోయిన్‌గా చేసే అవకాశం కొట్టేసి లక్కీ గర్ల్ అనిపంచుకుంది. ఆ సినిమాలో కుర్ర హీరోయిన్ రాధికా ఆప్టే మధ్య వయస్కురాలిగా కనిపిస్తు… వయసుపెరుగుతున్న గ్యాంగ్‌స్టర్‌కి భార్యగా నటించింది. ఇంత చిన్న వయస్సులో […]

వయసెక్కువ హీరోలపై ఫీదా అవుతున్న రాధికా ఆప్టే
X

‘లెజెండ్ ‘ మరియు ‘రక్త చరిత్ర ‘సినిమాల‌ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. హిందీలో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు ఒకదాని వెంట మరొకటె చేస్తు మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా (కబాలి)లో ఆయన పక్కన హీరోయిన్‌గా చేసే అవకాశం కొట్టేసి లక్కీ గర్ల్ అనిపంచుకుంది. ఆ సినిమాలో కుర్ర హీరోయిన్ రాధికా ఆప్టే మధ్య వయస్కురాలిగా కనిపిస్తు… వయసుపెరుగుతున్న గ్యాంగ్‌స్టర్‌కి భార్యగా నటించింది. ఇంత చిన్న వయస్సులో తలనెరిసిన పాత్ర ఎందుకు చేసావు అని అడిగితే.. ఒక జీవిత సత్యం చెప్పిందీ అమ్మడు.

సాధారణంగా అమ్మాయిలకు తమకన్నా పెద్దవయస్సు మగాళ్ళంటేనే ఇష్టం. అలాంటివారినే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వారిలో తమ ఫాదర్‌ను చూసుకుంటారు గనుక అని వివరించింది. ఆమె చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. మన పెద్దలు.. అమ్మయికన్నా అబ్బాయి పెద్ద వయస్సు ఉన్నవాడినే వరుడిగా సెలెక్ట్ చేస్తారు కనుక. మొత్తానికి ఈ కుర్ర హీరోయిన్ మాత్రం వయసెక్కువ మగాళ్ళనే ఇష్టపడుతుంది అనేది మాత్రం చెప్పకనే చెప్పింది కదా!

First Published:  23 May 2016 9:49 AM IST
Next Story