ఈ పదవి అధికారం కాదు...సేవకు అవకాశం!
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికోసం బిజెపి తరపున పోటీచేసి విఫలమైన కిరణ్‌బేడి, తనకు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అవకాశం దక్కటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కిరణ్ బేడీని పుదుచ్చేరి గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం దక్కటం పట్ల ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల బాధలు తీర్చడాన్ని తన జీవన పరమార్ధంగా […]

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికోసం బిజెపి తరపున పోటీచేసి విఫలమైన కిరణ్‌బేడి, తనకు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అవకాశం దక్కటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కిరణ్ బేడీని పుదుచ్చేరి గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం దక్కటం పట్ల ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల బాధలు తీర్చడాన్ని తన జీవన పరమార్ధంగా భావిస్తానన్నారు. ప్రజలకు సేవచేసే అవకాశం రావటం తన అదృష్టమన్నారు. తనకు దక్కిన ఈ పదవిని ఒక అధికారంగా కాకుండా సేవచేసే అవకాశంగా భావిస్తున్నానన్నారు.