నా మనవడి స్నేహితుల కులం అడిగి... సిగ్గుపడ్డా!
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ టీడీపీ నాయకత్వాన్ని జ్యోతుల తప్పుపట్టారు. తెలంగాణలో టీడీపీ నిర్వీర్యం అవడానికి కారణం అక్కడి నాయకత్వలోపమేనని తేల్చేశారు. అయితే తెలంగాణ టీడీపీ నాయకత్వం అంటే ఎవరు?. టీటీడీపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న లోకేషా, లేక టీటీడీపీకి దిక్కుగా మిగిలిన ఒకే ఒక్కడు రేవంతా అన్నది జ్యోతుల చెప్పలేదు. ఒక వేళ జ్యోతుల చెప్పినట్టు టీటీడీపీ నాయకత్వ లోపం వల్లే నిర్వీర్యం అయి […]
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ టీడీపీ నాయకత్వాన్ని జ్యోతుల తప్పుపట్టారు. తెలంగాణలో టీడీపీ నిర్వీర్యం అవడానికి కారణం అక్కడి నాయకత్వలోపమేనని తేల్చేశారు. అయితే తెలంగాణ టీడీపీ నాయకత్వం అంటే ఎవరు?. టీటీడీపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న లోకేషా, లేక టీటీడీపీకి దిక్కుగా మిగిలిన ఒకే ఒక్కడు రేవంతా అన్నది జ్యోతుల చెప్పలేదు. ఒక వేళ జ్యోతుల చెప్పినట్టు టీటీడీపీ నాయకత్వ లోపం వల్లే నిర్వీర్యం అయి ఉంటే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూడా బాధ్యులే కదా అని టీటీడీపీ నేతలు అంటున్నారు. నాయకత్వ లోపం వల్లే ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి తాము ఫిరాయించామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా జ్యోతుల నెహ్రు టీటీడీపీ ప్రస్తావన కూడా చెప్పారు. తాము పార్టీ మారడానికి బాధ్యత జగన్‌దేనని జ్యోతుల నెహ్రు చెప్పారు.
ఏపీలో కులవైషమ్యాలు తగ్గుతాయని నెహ్రు అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం తన మనవడు నలుగురు స్నేహితులతో కలిసి చదువుకోవడానికి మద్రాస్ వెళ్లారని చెప్పారు. ఆ సమయంలో ఆ నలుగురు స్నేహితులు కాపులా, కమ్మలా, రాజులా అని ప్రశ్నించానని జ్యోతుల చెప్పారు. తాను ఎప్పటిలాగే ఆ విషయం అడిగానని చెప్పారు. అయితే తన మనవడు మాత్రం తమకు కులాల గురించి తెలియదని వాటిని తాము పట్టించుకోమని చెప్పాడని జ్యోతుల వివరించారు. మనవడి సమాధానం విన్న తర్వాత తాను సిగ్గుపడ్డానన్నారు. తన కులానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారన్న ఆశతోనే పీఆర్పీలో చేరినట్టు చెప్పారు. తనకు జీవితంలో అత్యంత ఆనందం కలిగించిన విషయం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమేనని అన్నారు. పార్టీని లక్ష్మీపార్వతి చేతిలో పడకుండా కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాజకీయ చతురత వల్లే ఓటమి అంచున ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని… ఆ చతురత లేకపోవడం వల్లే గెలుపు అంచున ఉన్న జగన్ ఓటమి చెందారని నెహ్రు విశ్లేషించారు. తమకు మంత్రి పదవి ఇస్తానని స్వయంగా చంద్రబాబే చెప్పారన్నారు.
Click on Image to Read: