యాంకర్ కి క్లాస్ పీకిన మారుతి
టెలివిజన్ మరియు ఈవెంట్స్‌లో యాంకర్ గా వ్యవహరించాలంటే మాటకారితనము ఉండాలి. అలా అని ఏదిబడితే అది అడిగి వ్యక్తిగత విషయాల్లోకి ఎంటరైతే ఎలాఉంటుందో యాంకర్ రవికి నిన్న జరిగిన జెంటిల్ మ్యాన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో బాగా అర్ధమై ఉంటుంది.
టెలివిజన్ మరియు ఈవెంట్స్‌లో యాంకర్ గా వ్యవహరించాలంటే మాటకారితనము ఉండాలి. అలా అని ఏదిబడితే అది అడిగి వ్యక్తిగత విషయాల్లోకి ఎంటరైతే ఎలాఉంటుందో యాంకర్ రవికి నిన్న జరిగిన జెంటిల్ మ్యాన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో బాగా అర్ధమై ఉంటుంది. ఇంతకీ ఏమయ్యిందంటే.. రవి ఆ ఆడియో వేడుకకు హాజరయిన సెలెబ్రిటీలను ఒక ప్రశ్న అడుగుతూ పోతున్నాడు, "మీ మీ రొమాంటిక్ మూమెంట్స్ ఏమిటని?" హీరోలు నాని మరియు సుమంత్ అశ్విన్ ప్రశ్నను ఇబ్బంది పడుతూ దాటవేసారు.
ఇక డైరెక్టర్ మారుతి వంతు వచ్చింది. "ఇంత మంది జనాలు చూస్తున్న వేడుకలో ఇలాంటి ప్రశ్నలు ఏమిటి? నువు చెప్పు నీ రొమాన్స్ ఏమిటో? ఎవరితో చేసావు? ఎప్పుడు చేసావు? ఎలా చేసావు?" 'అసలు బుద్ధుండాలయ్యా ఇటువంటి ప్రశ్నలు వేయడానికి అన్నంత రేంజ్లో రవిని గుక్క తిప్పుకోకుండా చేసాడు మారుతి. దెబ్బకు రవి సైలెంట్ అయిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి తన్ కో-యాంకర్ శ్రీముఖితో చేరి 'ఇకపై ఇలాంటివి అడగకూడదు' అన్నట్లు సైగతో చెప్పాడు. ఏమైనా పబ్లిక్‌లో ఏం మాట్లాడుతున్నామో ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి. డీసెన్సీ మెయింటెయిన్ చెయ్యడం రావాలి ఒక సంధానకర్తకు. ఏమంటారు?