సతీష్‌రెడ్డి గడ్డం అమరావతి వరకు పెరగాల్సిందే!
రాయలసీమ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన బస్సు యాత్ర కడప జిల్లా జమ్మలమడుగుకు చేరింది. ఈ సందర్భంగా మాట్లాడిన బైరెడ్డి చంద్రబాబు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీమ ముఖ్యమంత్రులు దోపిడి, కోస్తా నేతల మోసానికి రాయలసీమ తరతరాలుగా అన్యాయం అయిపోతోందన్నారు. ఇప్పటికైనా సీమ మేధావులు, విద్యావంతులు చైతన్యవంతులు కావాలని కోరారు. అనంతపురం, కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించుకుపోయారని మండిపడ్డారు. సీమలోని కాల్వ గట్ల మీద నిద్రపోతానంటున్న సీఎం […]
రాయలసీమ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన బస్సు యాత్ర కడప జిల్లా జమ్మలమడుగుకు చేరింది. ఈ సందర్భంగా మాట్లాడిన బైరెడ్డి చంద్రబాబు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీమ ముఖ్యమంత్రులు దోపిడి, కోస్తా నేతల మోసానికి రాయలసీమ తరతరాలుగా అన్యాయం అయిపోతోందన్నారు. ఇప్పటికైనా సీమ మేధావులు, విద్యావంతులు చైతన్యవంతులు కావాలని కోరారు.
అనంతపురం, కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించుకుపోయారని మండిపడ్డారు. సీమలోని కాల్వ గట్ల మీద నిద్రపోతానంటున్న సీఎం చంద్రబాబు.. ముందు శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని కాపాడాలన్నారు. ఇప్పటికైనా రాయలసీమ విషయంలో చంద్రబాబు, జగన్ డ్రామాలు ఆపాలన్నారు. శ్రీశైలం కనీస నీటిమట్టం జీవోను పునరుద్దరించకుంటే శానసమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గడ్డం ఇలాగే పెంచుకుని తిరగాల్సి ఉంటుందన్నారు. సతీష్ రెడ్డి గడ్డం అమరావతి వరకు పెరిగినా కడప కాల్వలకు మాత్రం నీరు రావన్నారు. (గండికోట రిజర్వాయర్ కు నీరు తెచ్చే వరకు గడ్డం తీయబోనని ఏడాది క్రితం సతీష్ రెడ్డి శపథం చేశారు. కానీ ఇప్పటికీ నీరు రాలేదు . దీంతో ఆయన గడ్డం పెంచుకుని తిరుగుతున్నారు). జమ్మలమడుగులోని బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి చెందిన ఇనుపసామాన్లను కొందరు అమ్ముకుంటున్నారని ఇలాగైతే పరిశ్రమ ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు.
Click on Image to Read: