సముద్రమే స్మశానం!
సిరియా సంక్షోభ సమయంలో యూరప్ దేశాలకు వలస వెళుతూ మధ్యధరా సముద్రంలో పడవలు మునిగిపోయి దాదాపు నాలుగువేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి చివరి మజిలీ సముద్రమే అయ్యింది. అలియన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుని శవం టర్కీలో సముద్రం ఒడ్డున కనిపించిన తీరు ప్రపంచాన్నే కలచివేసిన సంగతి తెలిసిందే. అలా అత్యంత విషాదంగా జీవితాలను సముద్రంలో ముగించినవారికి నివాళిగా, ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సముద్రాన్నే స్మశానంగా మార్చివేసింది. 200 సమాధులను మధ్యధరా సముద్రంలో నిర్మించింది. […]
సిరియా సంక్షోభ సమయంలో యూరప్ దేశాలకు వలస వెళుతూ మధ్యధరా సముద్రంలో పడవలు మునిగిపోయి దాదాపు నాలుగువేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి చివరి మజిలీ సముద్రమే అయ్యింది. అలియన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుని శవం టర్కీలో సముద్రం ఒడ్డున కనిపించిన తీరు ప్రపంచాన్నే కలచివేసిన సంగతి తెలిసిందే. అలా అత్యంత విషాదంగా జీవితాలను సముద్రంలో ముగించినవారికి నివాళిగా, ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సముద్రాన్నే స్మశానంగా మార్చివేసింది. 200 సమాధులను మధ్యధరా సముద్రంలో నిర్మించింది. టర్కీకి చెందిన ఈ స్వచ్ఛంధ సంస్థ సిరియా సంక్షోభం గురించి అవగాహన కలిగించేందుకే ఈ సీ సిమెటరీ ప్రాజెక్టుని చేపట్టినట్టుగా తెలిపింది. ఈ సంస్థ వెబ్సైట్, సిరియా శరణార్ధులకు ఆర్థిక సహాయం చేయాలనుకునే వారి కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. మధ్యధరా సముద్రంలో నీళ్ల మధ్య తేలుతున్నట్టుగా ఉన్న ఈ సమాధులు సిరియా సంక్షోభానికి నిలువెత్తు సాక్ష్యల్లా కనబడుతున్నాయి.