Telugu Global
NEWS

సుజనా చౌదరి నా వద్దకు వచ్చి బతిమాలాడు... బ్రాహ్మణ నిధులను టీడీపీ కార్యకర్తలే నొక్కేస్తున్నారు

టీడీపీ ప్రభుత్వంపై విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిధులన్నీ టీడీపీ కార్యకర్తలే నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బ్రాహ్మణుల ఓట్ల కోసం సుజనా చౌదరి తన వద్దకు వచ్చారని స్వరూపానందేంద్ర వెల్లడించారు. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత మాట తప్పిన పెద్దమనిషి సుజనా చౌదరి అని మండిపడ్డారు. రూ. 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం […]

సుజనా చౌదరి నా వద్దకు వచ్చి బతిమాలాడు... బ్రాహ్మణ నిధులను టీడీపీ కార్యకర్తలే నొక్కేస్తున్నారు
X

టీడీపీ ప్రభుత్వంపై విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిధులన్నీ టీడీపీ కార్యకర్తలే నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బ్రాహ్మణుల ఓట్ల కోసం సుజనా చౌదరి తన వద్దకు వచ్చారని స్వరూపానందేంద్ర వెల్లడించారు. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత మాట తప్పిన పెద్దమనిషి సుజనా చౌదరి అని మండిపడ్డారు.

రూ. 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం నామమాత్రపు నిధులతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని విమర్శించారు. ఆ నిధులు కూడా టీడీపీ కార్యకర్తలే నొక్కేస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణులంటే టీడీపీకి ఎందుకంత వైరం అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా పోరాడే శక్తి తమకుందన్నారు. ఏపీలో బతకలేని పరిస్థితి వస్తే హిమాలయాలకు వెళ్లిపోతానని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులంతా టీడీపీకే ఓటేస్తారనుకోవడం అవివేకమన్నారు. ఆలయాల్లో అర్చకుల చేత గొడ్డుచాకిరి చేయించుకుంటున్నారని… జీతాలు మాత్రం ఇవ్వడం లేదని స్వరూపనందేంద్ర సరస్వతి ఫైర్ అయ్యారు.

విజయవాడలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన విప్రోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

gottipati-jagan

kothapalli-subbarayudu

sonia-gandhi-venkaiah

lokesh-chandrababu-naidu

chalasani-manikyalarao

chandrabau-naidu

rgv-maheshbabu

mudragada-padmanabham,-Hars

tg-venkatesh

brahmotsavan-movie-review

narayana

jyothula1

jyotula

chandrababu-naidu-comments-

First Published:  22 May 2016 5:25 PM IST
Next Story