మూర్ఖుడు వరకట్నం అడిగినట్టుంది " మాణిక్యాల ... చిందులు తొక్కిన చలసాని
ప్రత్యేక హోదా అంశంలో బీజేపీని అధికార పార్టీతో పాటు దాని అనుబంధ వ్యక్తులు కూడా టార్గెట్ చేయడంపై మంత్రి మాణిక్యాలరావు తీవ్రంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి … అదే వేదికపై కూర్చున్న మేధావి చలసాని శ్రీనివాస్‌ను టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చలసాని ఏం మాట్లాడారో తాను వినలేదని అయితే ఆయన ప్రసంగంలో తప్పనిసరిగా ప్రత్యేక హోదా అంశం ఉంటుందని మంత్రి ప్రసంగం మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో ఏ పనులు చేసుకోకుండా […]
ప్రత్యేక హోదా అంశంలో బీజేపీని అధికార పార్టీతో పాటు దాని అనుబంధ వ్యక్తులు కూడా టార్గెట్ చేయడంపై మంత్రి మాణిక్యాలరావు తీవ్రంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి … అదే వేదికపై కూర్చున్న మేధావి చలసాని శ్రీనివాస్‌ను టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చలసాని ఏం మాట్లాడారో తాను వినలేదని అయితే ఆయన ప్రసంగంలో తప్పనిసరిగా ప్రత్యేక హోదా అంశం ఉంటుందని మంత్రి ప్రసంగం మొదలుపెట్టారు.
సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో ఏ పనులు చేసుకోకుండా ఉద్యోగులు, ప్రజలను తప్పుదారి పట్టించిన మేధావులు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్న మేధావులు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గతంలో స్పెషల్ స్టేటస్ అన్నారని… కానీ తాము స్పేషల్ రాష్ట్రంగా అభిమానం ఉన్న రాష్ట్రంగా ఏపీని చూస్తున్నామని చెప్పారు.
పదం ఒక్కటే మారిందని ఏపీకి ఏం కావాలో అన్ని ఇస్తున్నామని మంత్రి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అన్న పదం మాత్రమే మారిందన్నారు. ఈ సందర్భంగా మాణిక్యాల రావు వరకట్నానికి, బహుబతికి ఉన్న తేడాను వివరిస్తూ ఒక ఉదాహరణ చెప్పారు. వరకట్నం తీసుకోవడం నేరం కాబట్టి ఒక వ్యక్తి అల్లుడికి బహుబతి కింద 20 లక్షలు ఇచ్చారని.. కానీ మూర్ఖుడైన అల్లుడు మాత్రం బహుబతి కింద వద్దు తనకు వరకట్నం పేరుతోనే రూ.20లక్షలు ఇవ్వాలని కోరారని చెప్పారు. అల్లుడు అలా చేస్తే మామ కూడా ఏం చేయగలరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న మేధావుల తీరు కూడా మూర్ఖుడు వరకట్నం అడిగినట్టుగా ఉందన్నారు.
ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటున్నా కూడా కొందరు మాత్రం జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి మాణిక్యాలరావు మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలపై చలసాని ఉలిక్కిపడ్డారు. వేదికపైనే కాసేపు అటు ఇటు తిరుగుతూ అరుస్తూ హల్ చల్ చేశారు. మంత్రి సమైక్యవాదులను అవమానిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం తాను ఎప్పటి నుంచో పోరాడుతున్నానని అన్నారు. ఓ ఐదు నిమిషాల పాటు చలసాని చిందులు తొక్కారు. చివరకు అక్కడున్న వారు తీసుకెళ్లి ఆవేశపడవద్దూ అంటూ కూర్చీలో కూర్చొబెట్టారు.
Click on Image to Read: